Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

Advertiesment
Samantha

సెల్వి

, శుక్రవారం, 5 జులై 2024 (14:31 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చిక్కులో పడింది. సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలపై సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు అనవసరమైన మెడిసన్స్ జోలికి వెళ్లకుండా.. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) చేస్తే.. మ్యాజిక్‌లా పనిచేస్తుంది’ అంటూ తను నెబిలైజర్ పెట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. 
 
అయితే సైంటిఫిక్ సొసైటి ది ఆస్మా అండ్ అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆరోగ్యానికి ప్రమాదమని, నెబ్యులైజ్ చేయద్దని, ప్రజలను హెచ్చరించింది. ఆమెకు సాయం అవసరం.. అలాగే మెరుగైన సలహాదారుడు అవసరం’ అంటూ ఎక్స్ వేదికగా ఓ వైద్యుడు ట్వీట్ చేశారు. శ్వాసకోశ వైరల్ ఇన్ ఫెక్షన్లను నివారించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడమని చెబుతుండటం.. బుద్ది తక్కువ పని అంటూ వైద్యుడు మండిపడ్డారు. 
 
అలాగే సోషల్ మీడియా ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు చెబుతున్నారు కొంత మంది ఇన్ల్లుయెన్సర్లపై భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ఏదైనా హెల్త్ రెగ్యులేటరీ బాడీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది.. ఈ సలహాల వల్ల ప్రజలు చనిపోయే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరించారు. 

సెలబ్రిటీ ముసులో ఇలాంటి సమాచారాన్ని అందిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నసమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమెను జైలులో పెట్టాలన్నాడు దీనిపై సమంత స్పందిస్తూ తనను జైలులో పెట్టిన పర్లేదని.. సదరు వైద్యుడికి తనకంటే ఎక్కువ తెలిసినా.. తను అనుసరిస్తున్న వైద్య విధానాల్ని మాత్రమే సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నానని.. డబ్బుల కోసం ఈ పని చేయటం లేదని క్లారిటీ ఇచ్చింది.

అంతా అవగాహనతోనే చేస్తున్నానని అంటోంది.  25 ఏళ్ల పాటు డీఆర్డీవోలో సేవలు అందించిన ఓ సీనియర్ వైద్యుడు తనకు ప్రత్యామ్నాయ వైద్య విధానాల గురించి చెప్పారని సమంత వెల్లడించింది. ఈ విషయంలో తనను జైలులో పెట్టినా అభ్యంతరం లేదని సమంత వెల్లడించింది. 
 
ఇంకా సమంత స్పందిస్తూ.. తనను జైలులో బంధిస్తారని.. అరెస్ట్ చేస్తున్నారని చాలామంది అంటున్నారని.. తనకు ఆరోగ్యం నుంచి నయం చేసిన చిట్కాలనే అభిమానులతో పంచుకుంటున్నానని క్లారిటీ ఇచ్చింది. 
 
దీనికోసం తనను బంధిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను చెప్పే చిట్కాలు పక్కావేనని.. ఈ విధానం బయటికి చెప్పే తనను జైలులో వేస్తారా అని ప్రశ్నించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)