ఎన్.టి.ఆర్. దేవరకు క్రేజ్ మామూలుగా లేదుగా !

డీవీ
బుధవారం, 21 ఆగస్టు 2024 (10:55 IST)
Ntr, jahnvi
ఎన్.టి.ఆర్. దేవరకు క్రేజ్ మామూలుగా లేదు. పుష్ప 2, గేమ్ ఛేంజర్ ను కూడా దాటిపోయింది. ఈ రెండు సినిమాలకు అస్సలు పెద్దగా క్రేజ్ లేదనీ సోషల్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. కానీ, దేవరకు క్రేజ్ బాగుంది. దీనిగురించి ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన ఆర్మాక్స్ సినిమాటిక్స్ సర్వేలో తెలుగులో ది మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘దేవర పార్ట్-1’ నిలిచినట్లు పేర్కొంది. జాహ్ణవి కపూర్ కూడా సినిమాకు ప్లస్ అయినట్లు తెలుస్తోని.  అంతే ఇదిగా మిగిలిన సినిమాలైన ‘పుష్ప-2’, ‘ఓజి’, ‘జై హనుమాన్’, ‘స్పిరిట్’ కూడా దేవర తర్వాతే నిలిచినట్లు పేర్కొంది. గేమ్ ఛేంజర్ ఊసే లేదు. 
 
దీనితో ఎన్.టి.ఆర్. అభిమానులు చాలా ఆనందంగా వున్నారు. ఆర్.ఆర్.ఆర్. తర్వాత రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ స్థానం వచ్చినా ఎన్.టి.ఆర్.కూడా రావాల్సిందని అప్పట్లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర కథ పాన్ వరల్డ్ కథగా రూపొందుతోంది. సముద్ర దొంగల నేపథ్యంలో అరేబియా సముద్రంలో గగుర్పాటుకల్గించే యాక్షన్ ఎపిసోడ్స్ ను విదేశీ, స్వదేశీ కొరియోగ్రాఫర్లు పనిచేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ‘దేవర పార్ట్-1’ సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ కానున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే ఒకే ఉపాధ్యాయుడు వున్న స్కూళ్లతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం

డ్రైవర్ రాయుడు వీడియోను నిన్ననే చూశా... నాపై కుట్ర జరుగుతోంది... ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

Balakrishna: ఓపికపట్టండి.. అవసరమైనప్పుడు మంత్రి పదవి వస్తుంది.. బాలయ్య

వామ్మో.. జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయమన్నారట.. జనార్ధన్ రావు వీడియో వైరల్

అమరావతిని ఆకాశంలో నిర్మించలేం.. దేనికైనా భూమి కావాలి కదా?: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments