Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (13:27 IST)
నటుడు రాహుల్ రవీంద్రన్‌కు హీరోయిన్ సమంతకు మధ్య ఏదో సంబంధం ఉందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత చెప్పుకొచ్చింది. 
 
తాజాగా కోలీవుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గోల్డెన్ క్వీన్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. 
 
"ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ రాహుల్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. మా బంధానికి ఓ పేరు పెట్టలేను. స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను" అంటూ రాహుల్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచాడు. అభిమానుల మద్దతు తన అదృష్టమని, తన కష్టం, లక్ వల్లే ఇంత ఆదరణ లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. 
 
ఇక తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ, "మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని బట్టి కేరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. తెలిసీ, తెలియక తీసుకునే ఎన్నో నిర్ణయాలు మన ప్రయాణంపై ప్రభావం చూపుతాయి" సమంత అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దర్శకురాలు సుధ కొంగర సమంతపై ప్రశ్నసలు కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments