Gopichand, Meenakshi Dinesh, BVSN Prasad, Kumar Sai
గోపీచంద్, మీనాక్షి దినేష్ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ నెం.39 చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. సాహసం తర్వాత గోపీచంద్ మళ్లీ ఈ బ్యానర్‌లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సాహసం తర్వాత సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ ISC కూడా ఈ టీంలో జాయిన్ అయ్యారు.
ఈ టీం బాక్సాఫీస్ వద్ద మరో సారి సంచలనాన్ని సృష్టిస్తుండటం ఖాయమనిపిస్తోంది. అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మలయాళ నటి మీనాక్షి దినేష్ ఈ థ్రిల్లర్‌లో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది.
బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.