Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

Advertiesment
Nellure- Sri Rambabu

దేవీ

, శుక్రవారం, 21 మార్చి 2025 (16:37 IST)
Nellure- Sri Rambabu
ఇప్పడు బెట్టింగ్ యాప్ హాట్ టాపిక్ గా మారింది. అందులో ప్రముఖ హీరోలు ప్రమోట్ చేశారు. కానీ అవి కాలాతీతమైందని వారు వెంటనే ప్రకటన వెలువరించారు. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా వంటివారు తమ టీమ్ తో ఓ ప్రకటన వెల్లడించారు. ఇప్పుడు మరో ట్విస్ట్ నెల్లూరుకుచెందిన శ్రీరాంబాబు అనే వ్యక్తి హైదరాబాద్ వచ్చి ఓ ఛానల్ వారిని కలిశాడు. ఆయన చెప్పినదానిలో చాలా ట్విస్ట్ లున్నాయి.
 
నెల్లూరులో ముఠా మేస్గ్రీగా వుంటూ, టెంట్ హౌస్ నిర్వహిస్తున్న శ్రీరాంబాబు అనే వ్యక్తి బెట్టింగ్ యాప్ తో 80 లక్షలు పోగొట్టుకున్నానంటూ ఓ యూ ట్యూబ్ చానల్ కు వివరించారు. బెట్టింగ్ గేమ్ అనేది వ్యవసనం అని నిదానంగా అలవాటు అయిపోతామని అంటున్నాడు. కరోనా తర్వాత టీవీలో అన్ స్టాపబుల్ షో లో బాలక్రిష్ణ హోస్ట్ గా, ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా వచ్చారు. ఆ షోలో ఫన్ 88, స్పైట్, రియల్ మి యాప్ లో స్పాన్సర్ గా వచ్చారు.

2023 లో ఈ యాప్ మొదలైంది. ఫేస్ బుక్ లో కూడా ఫన్ 88 యాప్ కూడా వచ్చింది. అందర్ బాహార్ వంటి గేమ్ లు కూడా వుంటాయి. ఈ షోలోనే బాలక్రిష్ణగారు ప్రభాస్ కు ఫన్ 88 గిఫ్ట్ గా షోలో ఇచ్చారు. అందులో బహుమతులున్నాయి. గేమ్ ఆడితే వస్తాయంటూ చెప్పారు. అది చూసి నేను గేమ్ లు మొదలు పెట్టాను. మొదట్లో రాబడి వుంది. తర్వాత పోతూ వున్నాయి. దాదాపు ఇప్పటికీ 80 లక్ష లు పోయాయంటూ ఫోన్ పేలో వివరాలు వున్నాయని చెప్పారు.
 
వచ్చే ప్రకటన చూసి నేను బెట్టింగ్ పెట్టడం మొదలు పెట్టాను..  డబ్బులు వస్తాయ్ అనే ఆశతో ఆడటం మొదలు పెట్టాను.  మొదట్లో 3 లక్షల వరకు వచ్చాయి.. ఆ తర్వాత వాళ్ల ఊబిలోకి లాగుతారు. నేను అలా రూ.80 లక్షలు నష్టపోయి ఆత్మహత్యాయత్నం కూడా చేశాను.

గత్యంతరలేక పోలీస్ స్టేషన్ కు వెళితే, పోలీసులకు చెప్పితే నీమీద కేస్ పెడతారంటూ వారు సమాధానం చెబుతున్నారు. నేను ఆత్మ హత్య కూడా చేసుకోవాలనుకుంటున్నాను. పంజాగుట్ట పోలీస్ స్టేష న్ లో కేసులు పెట్టారంటూ.. ఓ ఛానల్ వారు చెబితే, నేను ఇక్కడికి వచ్చానంటూ యూ ట్యూబ్ ఛానల్ కు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ