ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో చేస్తున్న సినిమా 'ప్రేమంటే'."థ్రిల్-యూ ప్రాప్తిరస్తు" అనేది ట్యాగ్‌లైన్. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన తర్వాత జాన్వి నారంగ్ ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ ఇది.
తాజాగా ఈ చిత్రం థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్ చాలా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) బ్యానర్ల పై నిర్మిస్తున్నారు, స్పిరిట్ మీడియా దీనిని సమర్పిస్తోంది. ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమా ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు, అన్వర్ అలీ ఎడిటర్.