Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Advertiesment
Priyadarshi, Rupa Kodavayur

దేవీ

, గురువారం, 24 ఏప్రియల్ 2025 (10:55 IST)
Priyadarshi, Rupa Kodavayur
ప్రియదర్శి హీరోగా, రూపా కొడవయూర్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ఈనెల 25వ విడుదలకాబోతుంది. ఇప్పటికే రోజుకోచోట ప్రమోషన్ కు చిత్రం టీమ్ వెళుతున్నారు. నిన్ననే విజయవాడలో సుబ్బయ్య హోటల్ తో పాటు పలుప్రాంతాలను పర్యటించారు. బుధవారం నాడు టీం అంతా కూడా విజయవాడలో సందడి చేసింది. ‘సారంగపాణి జాతకం’ టీం దుర్గమ్మని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకుంది.

నేడు వైజాగ్ లో హంగామా చేయబోతున్నారు. వైజాగ్ లో ప్రీమియర్ షో కూడా ప్లాన్ చేశారు. అందులో భాగంగా నేడు ’తెల్లా తెల్లారినాదో ఊరుకోదు కన్ను ఏదోటి చూస్తానే ఉంటది  చూడాలెగాని చుట్టూ బోలెడంత ఫన్ను.. అంటూసాగే ప్రమోషన్ సాంగ్ ను విడుదల చేశారు.
 
ఈ థీమ్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్‌కు రామ్ మిర్యాల గాత్రం మరింత ఆకర్షణగా నిలిచింది. ‘సారంగపాణి జాతకం’ సినిమా ఎలా ఉంటుందో ఈ ఒక్క పాటలోనే చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పాటతో సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ కలగేజేసే ప్రయత్నం చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘సారంగపాణి జాతకం’ ఆడియో మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
 
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఈ చిత్రం ఉండబోతోందని ట్రైలర్ లో తెలియజేశారు. ఇంకా ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, నరేష్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, వైవా హర్ష వంటి వారంతా నవ్వించబోతోన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్