Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ హీరోగా నటిస్తానంటే సినిమా తీస్తా : సాక్షి సింగ్ ధోనీ

Webdunia
గురువారం, 27 జులై 2023 (10:11 IST)
తన భర్త మహేంద్ర సింగ్ ధోనీ హీరోగా నటిస్తానంటే సినిమా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన సతీమణి, నిర్మాత సాక్షి సింగ్ ధోనీ స్పష్టం చేశారు. ధోనీకి కెమెరా ముందు నిలబడటం ఎలాంటి బెరుకు లేదన్నారు. ఎందుకంటే ఆయన గత కొన్నేళ్లుగా అనేక వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారని, అందువల్ల ఆయన కెమెరా ఫియర్ అనేది లేదన్నారు. అందువల్ల మంచి స్క్రిప్టు వస్తే మాత్రం ఆయన నటించే అవకాశం ఉందని చెప్పారు. 
 
ధోనీ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరుపై హరీష్ కళ్యాణ్, ఇవాన జంటగా రమేష్ తమిళ్‌మణి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'ఎల్జీఎం' (లెట్స్ గెట్ మ్యారీడ్). ఈ నెల 28వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నగరంలో విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో చిత్ర నిర్మాత సాక్షి సింగ్ ధోనీ మాట్లాడుతూ, 'తమిళ ప్రజలకు మాకు భాష ఎలాంటి ప్రతిబంధకం కాదు. చెన్నైలో ధోనీకి లభించిన స్వాగతం ఒక భావోద్వేగంతో కూడుకున్నది. 
 
ధోనీకి ఈ కథను దర్శకుడు వినిపించినపుడు ఒక చిత్రంగా తీద్దామని చెప్పారు. ఈ స్టోరీ కాన్సెప్ట్ నా స్నేహితుల జీవితాల్లో, నేను విన్న విషయాలకు సంబంధించినదిగా కూడా ఉంది. పైగా అత్తాకోడళ్ళ సమస్య ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. సంసార బంధాలు, అందులో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి వివరించాం. ఇది ఒక పాజిటివ్ కథాంశంతో కూడిన సినిమా. దానికి కామెడీని జోడించి హాస్యభరితంగా తెరకెక్కించాం. 
 
ఈ సినీ జర్నీలో తమతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా భర్తకు తమిళ భాషపై ఉన్న అభిమానం కారణంగానే ఆయన కోలీవుడ్లో సినిమా తీయమని సూచించారు. ఆయన హీరోగా నటిస్తానంటే నిర్మాతగా సినిమా తీసేందుకు సిద్ధం' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments