Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమా అంటే ఓ ఇంటిని డిజైన్ చేసిన‌ట్లే నా భార్య డిజైనర్ : మహేంద్ర సింగ్ ధోని

Advertiesment
Sakshi-dhoni
, బుధవారం, 19 జులై 2023 (07:20 IST)
Sakshi-dhoni
నా భార్య సినిమా చేయాల‌ని నాతో చెప్పిన‌ప్పుడు నేను త‌న‌తో ఒకే మాట చెప్పాను. అదేంటంటే..సినిమా చేయ‌టం అంటే ఓ ఇంటిని డిజైన్ చేసిన‌ట్లు కాద‌ని. నువ్వు ఓ క‌థ‌ను ఫిక్స్ చేసుకుని, న‌టీన‌టులను కూడా ఎంపిక చేసుకో. నువ్వు ఒక్కసారి ఓకే అన్న‌త‌ర్వాత సినిమా చేస్తాన‌ని అన్నాను. అలా సినిమాను స్టార్ట్ చేశాం. మంచి టీమ్ కార‌ణంగానే త‌క్కువ స‌మ‌యంలోనే సినిమాను కంప్లీట్ చేశాం. సినిమా యూనిట్‌కు మంచి ఫుడ్ ఉండేలా చూసుకోమ‌ని చెప్పాను అని మహేంద్ర సింగ్ ధోని అన్నారు.
 
ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని, వికాస్ హ‌స్జా నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.
 
మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ ‘‘నేను సినిమా చూశాను. చాలా క్లీన్ మూవీ. చక్కటి ఎంట‌ర్‌టైన‌ర్‌. నేను నా కుమార్తెతో క‌లిసి  ఎల్‌జీఎం సినిమా చూస్తాను. త‌ను నన్ను చాలా ప్ర‌శ్న‌లు వేస్తుంది. అయితే కూడా నేను త‌న‌తోనే సినిమా చూస్తాను. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అద్భుతంగా వ‌ర్క్ చేశారు. చాలా మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాను నేను రూపొందించినందుకు గ‌ర్వంగా ఉంది. డైరెక్ట‌ర్ ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ఓ ఆర్కిటెక్ట్ కూడా.
 
సాక్షి ధోని మాట్లాడుతూ ‘‘LGM సినిమా గురించి చెప్పాలంటే మన చుట్టూ చాలా మంది ిలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి  పాయింట్ మీద సినిమా ఎందుకు చేయ‌కూడ‌ద‌నిపించింది. అప్పుడు ద‌ర్శ‌కుడు ర‌మేష్‌తో మాట్లాడి సినిమాను స్టార్ట్ చేశాం. ఈ సినిమా ప‌ర్టికుల‌ర్‌గా త‌మిళంలోనే చేయ‌టానికి కార‌ణం ధోనీయే. చెన్నైతో మాకున్న అనుబంధం కార‌ణంగా మా తొలి సినిమాను ఇక్క‌డే చేశాం’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జీవితంలో ఎక్కడ గెలిచినా చావు దగ్గర ఓడిపోవాలసిందే' : ఇంట్రెస్టింగ్‌గా 'హత్య' ట్రైలర్