Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క సినిమాతోనే అంత క్రేజా.. మోస్ట్ డిజైరబుల్ సెలబ్రిటీగా 19వ స్థానం

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (11:03 IST)
"గీత గోవిందం" సినిమా టైమ్‌లో రిలీజై, దానితో పోటీ పడి మంచి హిట్ సాధించిన మరో చిత్రం "ఆర్ఎక్స్ 100". రెండు చిత్రాలలో కథా కథనాలు పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ నుండి మంచి ఆదరణ లభించింది. అప్పటికే 'అర్జున్ రెడ్డి' సినిమా హిట్‌తో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాకు ప్లస్ అవ్వగా కొత్త హీరోగా 'ఆర్ఎక్స్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కార్తీకేయ గుమ్మకొండ. 
 
మంచి ఫిజిక్‌తో, పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన కార్తికేయ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు మరొక అరుదైన ఘనతను స్వంతం చేసుకుని సినీ వర్గాల చర్చలలో నిలిచాడు. హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన 2018 మోస్ట్ డిజైరబుల్ సెలబ్రిటీ క్యాటగిరీలో కార్తికేయ 19వ స్థానాన్ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 
 
వరంగల్‌కు చెందిన ఈ కుర్రాడు చేసింది ఒకే సినిమా అయిన తన బోల్డ్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల మనసు దోచుకొన్నాడని హైదరాబాద్ టైమ్స్ నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పుడు రెండో చిత్రం 'హిప్పీ‌'లో యాక్షన్ రోల్‌లో మన ముందుకు రాబోతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments