Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తవాన్ని ఆవిష్కరించిన 'బిలాల్‌‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌' (మూవీ రివ్యూ)

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (10:20 IST)
నటీనటులు..
మాగంటి శ్రీనాథ్‌, శాన్వీ మేఘన, గోరటి వెంకన్న, ప్రణవి, ఆర్‌.ఎస్‌.నందా, వెంకట్‌ గోవాడ, మల్లేష్‌, వైభవ్‌ తదితరులు
 
సాంకేతిక వర్గం..
 సినిమాటోగ్రఫీ - తోట వి రమణ, 
ఎడిటింగ్‌ - ఎస్‌.బి. ఉద్ధవ్‌, 
సంగీతం - సాబూ వర్గీస్‌, 
కథ, నిర్మాత - మహంకాళి శ్రీనివాస్‌, 
రచన, దర్శకత్వం - నాగసాయి మాకం.  
 
ఇప్పుడు గ్రామాల కథలను ఎంచుకోవడం ఓ ట్రెండ్‌ అయింది. కేరాఫ్‌ కంచెరపాలెం, రంగస్థలం.. ఇలా పలు చిత్రాలు అక్కడ జరిగిన వాస్తవికతను కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్నారు. అలాంటి ప్రయత్నమే 'బిలాల్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్‌' చిత్రం గురించి దర్శక నిర్మాతలు కృషి చేశారు. గ్రామాల్లో వుండే వాస్తవికతను కళ్ళకు కట్టినట్లు చూపించడమేకాకుండా పోలీసు బాధ్యతను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రివ్యూ ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం. 
 
కథ:
బిలాల్‌ పూర్‌ అనే ఊరికి కొత్తగా పోలీసు అధికారి సూర్య (మాగంటి శ్రీనాథ్‌) వస్తాడు. అక్కడ స్థానికంగా జరిగే గొడవలు చికాకు కలిగిస్తుంటాయి. కోడి పోయిందని, విందులో మాంసం వడ్డించలేదని, దూడ పొడిచిందనే కేసులు స్టేషన్‌కు వస్తుంటాయి. అలాంటి స్థితిలో ఊరి బ్యాంక్‌ దగ్గర దోపిడీ, ఊరిలో ఓ యువతి మిస్సింగ్‌, పెట్రోల్‌ బంకులో పనిచేసే వ్యక్తి హత్య.. సంఘటనలు సూర్యకు పజిల్‌లా అనిపిస్తాయి. ఒకదానికొకటి లింకు ఉందనే కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తాడు. మరోవైపు, స్టేషన్‌లోనే పనిచేసే హెడ్‌కానిస్టేబుల్‌ (గోరటి వెంకన్న) కూతురు శ్రీలత (శాన్వీ మేఘన)ని సూర్య ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ ఫలించిందా! లేదా! అనేది కూడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ:
నటీనటుల పరంగా, సాంకేతికపరంగా నూతనత్వం ఈ చిత్రంలో కన్పించింది. కథ ప్లాట్‌గా చూస్తే తమిళ చిత్రాల్లో వుండే నేచురాలిటీ కన్పించింది. తెలుగులోనూ ఇలాంటి ప్రయోగం చేయవచ్చని దర్శక నిర్మాతలు నిరూపించిన చిత్రమిది. ఇది గ్రామీణ ప్రజా జీవనానికి అద్దం పట్టే సినిమా. అక్కడి సమస్యలు, మనుషుల ప్రవర్తన ఎలా వుంటుందనేది గ్రామ ప్రజలద్వారా చూపించారు. పోలీసు స్టేషన్‌లో ఎటువంటి కేసులు వస్తాయనేవి ఆసక్తికరంగా అనిపించింది. కథల కోసం ఎక్కడికో వెళ్ళకుండా బిలాల్‌పూర్‌ అనే గ్రామంలోనే షూటింగ్‌ చేసి అక్కడ పరిస్థితుల్ని బాగా చూపించాడు దర్శకుడు. యువత చిన్న విషయానికి పెడదోవపట్టి దొంగతనాలు, హత్యలు ఎలా చేస్తారనే విషయంలో చాలా క్లారిటీ చూపించాడు. తెలంగాణ నేపథ్యంలో సాగిన మరో మంచి చిత్రమిది. 
 
నటీనటులపరంగా పోలీసు అధికారి సూర్యగా మాగంటి శ్రీనాథ్‌ పాత్రోచితంగా నటించారు. చిత్రానికి మూల స్తంభంలా  హెడ్‌ కానిస్టేబుల్‌ సురేందర్‌ పాత్రలో గాయకుడు గోరటి వెంకన్న నిలిచాడు. ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. మన ఊరిలో చూసే పోలీసు బాబాయ్‌‌లా సహజంగా నటించారు వెంకన్న. యూట్యూబ్‌లో ఫేమస్‌ అయిన ఆర్‌.ఎస్‌.నందా ఉన్న సన్నివేశాలన్నీ నవ్వులు పూయించాయి. వినోద సన్నివేశాల్లో వెంకన్న నటన ఎంతగా నవ్విస్తుందో... పోలీసు వృత్తిలో బాధలను వివరించే క్రమంలో అంత భావోద్వేగాలతో సాగుతుంది. శాన్వీ మేఘన అందమే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది.
 
ఇక టెక్నికల్‌ పరంగా దర్శకుడు నాగసాయి మాకం తను చెప్పాల్సిన పాయింట్‌ను సుత్తిలేకుండా నేరుగా చెప్పేశాడు. మన చుట్టూ జరుగుతున్న కథలాగే వుంటుంది. తోట వి.రమణ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. డైలాగ్స్‌పరంగా పోలీసు అంటే రెస్ట్‌లేని వాడంటూ సన్నివేశపరంగా సాగే సంభాషణలు, సుద్దాల అశోక్‌ తేజ రాసిన 'నిద్దుర లేని కళ్లకు అడ్రస్‌, అలసట లేని కాళ్లకు సిలబస్‌ అనే పాట' ఆయన సాహిత్య స్థాయిని చూపించింది. నిర్మాత మహంకాళీ శ్రీనివాస్‌‌కు తొలి చిత్రమైనా మంచి సినిమా చేయాలనుకునే తన అభిరుచి చూపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments