Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న 'మా' నూతన ప్యానెల్

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (09:56 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడిగా నటుడు వీకే (సీనియర్) నరేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమైన పదవులకు నరేష్ ప్యానల్ తరపున పోటీచేసిన సభ్యుల్లో ఎక్కువమంది విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, సంయుక్త కార్యదర్శిగా గౌతమ్‌రాజు, శివబాలాజీ విజయం సాధించారు. 
 
కాగా మా ఎన్నికల్లో గెలుపొందిన వీకే నరేష్ ప్యానెల్ గురువారం సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు. మర్యాదపూర్వకంగా కలిసిన నరేష్ ప్యానెల్ సభ్యులు సూపర్ స్టార్ కృష్ణతో కాసేపు ముచ్చటించి ఆరోగ్య బాగోగులు తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణం రాజుని గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. మాకు ఎంతగానో సహాయ సహకారం అందించి ఇంత ఘన విజయం పొందేందుకు సహకరించినందుకు మా అధ్యక్షుడు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారినిని మర్యాద పూర్వకంగా కలిశారు. అయన అంతే మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకుని అయన పలు హామీలు ఇచ్చారు. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనుంటాను, 'మా' అభివృద్ధికి, కళాకారుల బాగోగులు చూసుకునేలా అన్ని విధాలా సహకరిస్తాను అని అయన హామీ ఇచ్చినట్టు నరేష్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments