Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్' కోసం డబ్బింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ - చెర్రీ

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (13:21 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి ఏడో తేదీన విడుదలకానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇందులోభాగంగా, డబ్బింగ్ పనులు సాగుతున్నాయి. 
 
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ డబ్బింగ్‌ను పూర్తి చేశారు. మలయాళం వెర్షన్ కోసం కొన్ని చిన్న రీ-రికార్డింగ్, డబ్బింగ్ పనులు మినహా, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే దశలో ఉంది. 
 
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్, జీ5 సొంతం చేసుకున్నాయి. థియేట్రికల్ విడుదల తర్వాత సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వెర్షన్‌లు జీ5లో అందుబాటులో ఉంటాయి. హిందీ, కొరియన్, పోర్చుగీస్, టర్కిష్, స్పానిష్ వెర్షన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతాయి.
 
కాగా, స్వాతంత్ర్యానికి ముందు జరిగే ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ వంటి స్టార్స్ సైతం ఇందులో భాగం అయ్యారు. 
 
గత కొన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌‍కు తెర దించుతూ ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీ 7 జనవరి 2022 న థియేటర్‌లలోకి వస్తుందని రాజమౌళి ప్రకటించాడు. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు జోరుగా సాగుతున్నట్టు తాజాగా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments