ఎన్.టి.ఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న `ఆర్.ఆర్.ఆర్` సినిమా విడుదల తేదీన దర్శకుడు రాజమౌళి శనివారంనాడు బయటపెట్టారు. జనవరి 7వతేదీ 2022న సంక్రాంతి పండుగ సందర్భంగా ముందుగానే విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ఫోస్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు విదేశాల్లోనూ, ముంబైలోనూ జరుగుతున్నాయి. డి.ఐ., విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఈ సినిమాకు వుంటాయి. అందుకే వాటిని హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిసి పోరాడితే ఎలా వుంటుందనే కల్పిత కథతో విజయేంద్ర ప్రసాద్ రాసిన కథను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే సినిమాలోని నటీనటుల స్టిల్స్‌ను ఒక్కో సందర్భంలో విడుదలచేసి క్రేక్ తెచ్చారు. బాహుబలి నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇదిలా వుండగా దసరాకు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తెలియజేస్తున్నారు.