Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ తాజా సంచలనం డేంజరస్, ఇంతకీ.. కథ ఏంటో తెలుసా..?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (22:42 IST)
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాని ఎనౌన్స్ చేసాడు. కరోనా వలన అందరూ షూటింగ్ ఆపేసి ఇంట్లో ఉంటే.. వర్మ మాత్రం వరుసగా సినిమాలు తీస్తూ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించారు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్... ఇలా వరుసగా సినిమాలను విడుదల చేసారు.
 
ఈ సినిమాలు ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే... కమర్షియల్‌గా సక్సస్ సాధించారు. ఇంకా చాలా సినిమాలు రిలీజ్‌కి రెడీగా వున్నాయి. రోజుకో పోస్టర్ లేదా రోజుకో టైటిల్ పెట్టి వీటిపై సినిమా తీస్తున్నాను అని అందరికి షాక్ ఇస్తున్నాడు.
 
మర్డర్ అనే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే అల్లు, అర్నాబ్ అనే టైటిల్స్‌తో సినిమాలు తీస్తా అని ఎనౌన్స్ చేసారు.
 
తాజాగా.. మరో సినిమాని ప్రకటించారు. ఈ సినిమాకి డేంజరస్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇది ఒక లెస్బియన్ క్రైమ్ యాక్షన్ లవ్ స్టోరీ అని వర్మ తెలియచేసారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి.. ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం