Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్కింట్లోకి తొంగి చూస్తే, పడక గదిలో కెమెరాలు పెడతాం అంటే? మాధవీ లత పోస్ట్

webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (21:44 IST)
మాధవీలత మరోసారి తన ఫేస్ బుక్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి వచ్చిన విషయం దగ్గర్నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న విషయాలను జోడిస్తూ, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవారిని ఓ దుమ్ము దులిపేశారు. 
 
ఆమె ఫేస్‌బుక్ పోస్ట్ ఇలా వుంది చూడండి:
 
‘‘నేను పార్టీ‌లో చేరినపుడు ఒక మాట చెప్పాను
 
ఇపుడు అదే మాట మీద ఉన్నాను
 
నా పార్టీ అయినా తప్పు చేస్తే తప్పే బారాబర్ చెప్తా...
 
నన్ను దూరం పెడతారు అనే భయం లేదు
 
దూరం అవుతా అన్న బెంగ లేదు
 
నేనెపుడు దేశం కోసం ధర్మం కోసం పని చేస్తాను
 
మనుషుల కోసం వత్తాసుల కోసం కాదు
 
సమయం సందర్భం చూసి
 
ఎవరు ఎక్కడ రాజకీయ కుట్రలు చేస్తున్నారో
 
చెప్పేస్తా
 
మోడీజీ స్టైల్‌లో
 
పేరు చెప్పను
 
కానీ ఎదుటోడికి తెలిసిపోద్ది ఇత్తడైపోద్ది
 
ఇది పగ కాదు ప్రతీకారం కాదు
 
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి
 
బాధ్యతారాహిత్యంగా ఉండటం తప్పు
 
తమ సొంత అవసరాలకి ఆబ్లిగేషన్స్‌కి లొంగటం తప్పు
 
నా అదృష్టానికి కాదు ఇప్పటివరకు
 
జనాల అదృష్టానికి నా జోలికి ఎవరు రాలేదు
 
అందరు పద్దతిగా మర్యాదగా హుందాగా నాతో వ్యవహరించడం చూసాను... కనుక
 
నేనెపుడు మాట్లాడలేదు
 
వృత్తిపరంగా బాధ్యతలు తప్పేవాళ్ళకి అపుడపుడు చురకలు వేస్తూనే ఉంటా నా స్టైల్‌లో
 
నేను ప్రజల కోసం పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను...
 
ఎవరికీ బానిసని కాను ఊడిగం చేయను
 
అడుక్కోను
 
అవసరం లేదు
 
సినిమా రంగంలో సమస్యలు తెలిసే వచ్చా
 
పోరాడే తెలివి ఉంది కనుక అలాగే బతికా
 
రాజకీయంలో చదరంగం తెలిసి ఉండాలి
 
నాకు అంతగా రాదు అయినా తెగించి వచ్చా
 
పోరాడే శక్తీ ఉంది.. నా బలం నా ధైర్యమే
 
ఎవరికీ భయపడే పని లేదు
 
నాకు నచ్చి వచ్చాను
 
నచ్చకపోతే వెళ్ళిపోతాను
 
ఎవరికీ నన్ను ప్రశ్నించే హక్కు లేదు
 
సమాజ సేవ అనేది నా సొంత బాధ్యత నా సొంత ఆలోచన
 
నేను ఎవరికీ బానిసను కాను
 
జవాబుదారీ కాను
 
ఇపుడు ఇది ఎందుకు అంటారా ఏమో చెప్పాలి అనిపించింది చెప్తున్నా
 
పార్టీ ఎప్పటికి మంచిదే కానీ మనుషులంతా
 
మంచోళ్ళా అంటే ఎప్పటికి కాదు అనే అంటాను
 
మాట మార్చను
 
కాకపొతే అన్ని అవసరాలే
 
అదే నాకు నచ్చదు కానీ నా వలన ప్రజలకి మంచి జరుగుతుందేమో అని ఆశ
 
ఆశ లేకుంటే మనిషి బతకడం ఎందుకు
 
ఎవరి రాజకీయ కుట్రలకు నేను బలియైపోను
 
ఎవరిని సహించను
 
నేనింతే మీకు ముక్కు సూటితనం పనికొస్తాదా అంటే
 
వచ్చిన రాకున్నా నేనెవరికోసం తెర వెనక నటించే పని లేదు... నా వ్యక్తిగత జీవితం ఎవరికైనా అనవసరం
 
పక్కవాళ్ళ జీవితంలో వేలు కాళ్ళు పెట్టడం సంస్కార హీనం.. నీచం సోషల్ మీడియా సైకోలకి చెప్తున్నా
 
మీ అమ్మ నాన్న నేర్పించలేదేమో పక్కవాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం అంటే అది నీచం ఛండాలం అది క్రైమ్ అని
 
కనుక ఎవరి జీవితాల జోలికి ఎవరు వెళ్ళకపోవడం మంచిది ఇక్కడెవరు మంచోళ్ళు లేరు మడి కట్టుకున్నోళ్ళు లేరు.. మీ జీవితం మీరు చూసుకుంటే గొప్పవాళ్ళు అవుతారు కాదు ఎపుడు ఫేస్‌బుక్‌లో సోషల్ మీడియాలో పరాయివల్ల మీద బూతులు అవాకులు చవాకులు ఏడుస్తుంటే అలానే ఏడుస్తూనే ఉంటారు... కనుక అంతో ఇంతో అమ్మ నాన్నకు పుట్టి ఉంటే పద్దతిగా ఉండండి, కాదు మాకు వేరే పని లేదు మేం ఎపుడు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తాం ఇదే మా పని
 
పక్కింట్లోకి తొంగి చూస్తే, పడక గదిలో కెమెరాలు పెడతాం ఫేస్‌బుక్‌లో దూరి జనాలని తిడతాం అంటే
 
మీ కర్మకి మీరే బాధ్యులు .. పక్కవారి మంచి కోరుకుంటే మీరు బాగుంటారు
 
కాదు పరాయివల్ల నాశనం కోరుకుంటూ చావు కోరుకుంటూ అంత చెడ్డోళ్లు మేమే మంచోళ్ళమ్ అనుకుంటూ నీచంగ దిగజారేవాళ్లకి
 
ఎప్పటికి దిగజారుడు బతుకుగానే ఉంటుంది
 
మన కదలిక పది మందికి సంతోషాన్ని ఇవ్వాలి
 
అశాంతిని కాదు
 
మీ మాటలు, మీ నవ్వు.. పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే మీరు సరిగ్గా లేనట్లు
 
ఒకరిని సంతోష పెట్టకపోయినా పరవాలేదు బాధ పెట్టొద్దు ఎవరి అశాంతికి కారణం కావొద్దు
 
మీ మనశ్శాంతికి ఎవరు భంగం కలిగించినా
 
దూరంగా ఉండండి అలాంటి వారి నీడ కూడా
 
పడనివ్వకండి అని నా సలహా
 
నా ఇష్టం .....
 
మాధవీలత పసుపులేటి’’ అని మాధవీలత తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

నిన్నటి వరకు 'పవర్ స్టార్' .. నేడు 'అల్లు అరవింద్' : వర్మ టార్గెట్