Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుడిగాలి సుధీర్‍‍‍‍ గాలోడు ట్రైల‌ర్‌కి రెస్పాన్స్‌

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (16:56 IST)
Sudigaali Sudheer
సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టినుండే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్‌కి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా `గాలోడు` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌..
 
దాదాపు రెండున్న‌ర నిమిషాల నిడివిగ‌ల ఈ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండ‌బోతుందో ముందే హింట్ ఇచ్చారు మేక‌ర్స్.. ఫ‌స్ట్ టైమ్ సుధీర్ మాస్‌లుక్‌లో చేసే యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఒక‌వైపు మాస్ లుక్‌లో ఆక‌ట్టుకుంటూనే మ‌రోవైపు స్టైలీష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు సుధీర్. ఇక ``వ‌య‌సు త‌క్కువ `షో`లు ఎక్కువ‌, నువ్వు శ‌నివారం పుట్టావా? శ‌నిలా త‌గులుకున్నావ్‌, రామాయ‌ణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్క‌డ అంద‌రు మాయ లేడీలే..వంటి డైలాగ్స్‌లో ఎంట‌ర్‌టైన్ చేస్తూనే `వాడిది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్, సైనైడ్, యాసిడ్ కంటే డేంజ‌ర్‌రా వాడు, రాక్ష‌సుల గురించి పుస్త‌కాల్లో చ‌దివాను, విన్నాను మొట్ట‌మొద‌టి సారి వీడిలో చూశాను సార్` వంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచానాల్ని రెట్టింపు చేశాయి. గెహ్నాసిప్పి గ్లామ‌ర్‌, స‌ప్త‌గిరి కామెడీ టైమింగ్ ట్రైల‌ర్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సి. రాంప్ర‌సాద్ విజువ‌ల్స్, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్ లెవ‌ల్‌లో ఉన్నాయి.
 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా `గాలోడు` సినిమా న‌వంబ‌రు 18న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
 
సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌  త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌,  సంగీతం: భీమ్స్ సిసిరోలియో, స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి, ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments