Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జి.నాగేశ్వర రెడ్డి షాకింగ్ కథ చెప్పారు - సునీల్

Advertiesment
Sunil, Dhanraj, G.Nageswara Reddy, Garudavega Anji, Chandni Iyengar, Sudigali Sudhi
, గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:46 IST)
Sunil, Dhanraj, G.Nageswara Reddy, Garudavega Anji, Chandni Iyengar, Sudigali Sudhi
సునీల్, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. చాందినీ అయ్యంగార్‌ హీరోయిన్‌. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి  కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్పణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై  అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గా కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలౌతుంది.
 
ఈ సంద‌ర్భంగా సునీల్ మాట్లాడుతూ.. నాగేశ్వరరెడ్డి ఈ కథ చెప్పినపుడు షాక్ అయ్యా, ఆయన కామెడీ కథ చెప్తారు అని అనుకున్నా, షాకింగ్ కథ చెప్పారు. కథ విన్న వెంటనే ఈ సినిమా మంచి సినిమా అవుతుందని చెప్పాను. చాలా మంచి సందేశం ఇచ్చే సినిమా ఇది. ధనరాజ్ సిన్సియర్ ఆర్టిస్ట్. ఈ సినిమాకి రియల్ హీరోలు నాగేశ్వర్ రెడ్డి, వారి స్నేహితులు. నాగేశ్వరరెడ్డి గారు ఈ కథతో అంజిని దర్శకుడిగా చేయడం అభినందించదగ్గ అంశం. ధనరాజ్ పాత్ర ఇందులో అద్భుతంగా వుంటుంది. అలాగే చాందిని పాత్ర కూడా. ఈ సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. కంటెంట్ పరంగా ఈ సినిమా చాలా పెద్ద సినిమా. ఈ సినిమాని సెప్టెంబర్ 2న టికెట్ కొనుక్కుని థియేటర్లో చూడండి. మిమ్మల్ని తప్పకుండా థ్రిల్ చేస్తోంది'' అన్నారు.
 
ధనరాజ్ మాట్లాడుతూ.. ఇంత మంచి కథకి నేనే కరెక్ట్ అని నమ్మి నాతో సినిమా చేసి నాకు అండగా నిలబడ్డ నాగేశ్వరరెడ్డి గారికి థాంక్స్ మాత్రం చెప్పలేను.  నేను, సునీల్ అన్న మిగతా టీం అంతా గర్వంగా చెప్పుకునే కథ చేశాం. చాందిని కి కృతజ్ఞతలు. ఈ సినిమాతో అందరికీ మంచి విజయం వస్తుంది. సాయి కార్తిక్ అద్భుతమైన నేపధ్య సంగీతం ఇచ్చారు అన్నారు
 
దర్శకుడు మారుతి మాట్లడుతూ.. హాస్యం పండించే హాస్యనటులు ఒక థ్రిల్లర్ ని ఎంచుకోవడం ఒక డేరింగ్ స్టెప్. ఇక్కడే మొదటి  విజయం సాధించేసింది. అలాగే జి.నాగేశ్వరరెడ్డి గారు ఇలాంటి థ్రిల్లర్ తో రావాడం కూడా ఆసక్తికరంగా వుంది. సునీల్, ధనరాజ్ లాంటి మంచి నటులతో ఈ కథని తెరకెక్కించడం ఆనందంగా వుంది. అలాగే కెమరామెన్ ని డైరెక్టర్ గా పెట్టడం కూడా అభినందిచదగ్గ అంశం. సాయి కార్తిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘బుజ్జి ఇలా రా’ టైటిల్ తో ఒక థ్రిల్లర్ సినిమా చేయడం చాలా వైవిధ్యంగా వుంది. సినిమా పట్ల ఇష్టం ఎంతో ఇష్టం వున్న టీం కలసి చేసిన చిత్రమిది. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్.  ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి'' అని కోరారు.
 
సుడిగాలి సుదీర్ మాట్లాడుతూ.. ధనరాజ్ నాకు మంచి స్నేహితుడు. మేము సినిమా గురించే మాట్లాడుతుంటాం. నాగేశ్వరరెడ్డి గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. దర్శకుడు అంజి నాకు కెరీర్ బిగినింగ్ నుండి తెలుసు. మంచి టీం కలసి చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను
సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాటలు లేకుండా బీజీఏం పైన హెవీగా వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్.  నాగేశ్వర‌రెడ్డి గారితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే వుంటుంది. ధనరాజ్ ఈ సినిమా కోసం వంద కిలోమీటర్లు రన్ చేస్తుంటారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులంతా థియేటర్ లో చూడాలని కోరుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైద్ ఖాన్, జయతీర్థ చిత్రం బనారస్ నవంబర్ 4న విడుదల