Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కికి' ఛాలెంజ్‌ను స్వీకరించిన రెజీనా... వార్నింగ్ ఇచ్చిన పోలీసులు... (Video)

టాలీవుడ్ నటి రెజీనాకు హైదరాబాద్ నగర పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పుణ్యమాని వైరల్ అయిన కికి ఛాలెంజ్‌ను ఆమె స్వీకరించడమే ఈ వార్నింగ్‌కు కారణం. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (11:09 IST)
టాలీవుడ్ నటి రెజీనాకు హైదరాబాద్ నగర పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పుణ్యమాని వైరల్ అయిన కికి ఛాలెంజ్‌ను ఆమె స్వీకరించడమే ఈ వార్నింగ్‌కు కారణం. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
'కికి' చాలెంజ్ ప్రమాదకరమని చెబుతున్నప్పటికీ రెజీనా ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించింది. ఆ తర్వాత నెమ్మదిగా వెళుతున్న కారు డోర్ తీసుకుని కిందకు దిగి, కొద్దిసేపు డ్యాన్స్ చేస్తూ, కారుతో పాటే నడిచి, తిరిగి కారు ఎక్కింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, అది వైరల్ అయింది. 
 
సెలబ్రిటీలు ఇలా ప్రాణాంతకపు పనులు చేస్తే, పలువురు సినీ అభిమానులు కూడా దాన్ని అనుసరిస్తారని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడవచ్చని ట్రాఫిక్ ఏసీపీ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ తరహా పనులు చేయవద్దని రెజీనాను హెచ్చరించారు. హైదరాబాద్ రోడ్లపై 'కికి' చాలెంజ్ స్వీకరిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ చాలెంజ్ వల్ల ట్రాఫిక్‌ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని చెప్పారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments