Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల వంచి ఎరగడే రాయన్ గా ధనుష్ లుక్

డీవీ
శుక్రవారం, 10 మే 2024 (15:16 IST)
Rayan look
ధనుష్  తన 50వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ మరో లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ 'రాయన్'. కాళిదాస్ జయరామ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
 
తల వంచి ఎరగడే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎఆర్ రెహమాన్ మాస్ నంబర్‌ను కంపోజ్ చేశారు, పాటని గ్రాండ్‌గా చిత్రీకరించారు. ధనుష్ ఒక కార్నివాల్‌లో చాలా మంది గ్రామస్తులతో కలిసి మాస్ డ్యాన్స్‌లు చేస్తూ కనిపించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ లిరిక్స్‌తో హేమచంద్ర,  శరత్ సంతోష్ పవర్ ఫుల్ గా పాడిన ఈ పాటకు ప్రభుదేవా అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు.
 
ఈ పాట అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది, ప్రత్యేకించి మాస్‌కు బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో ధనుష్ హ్యాండిల్‌బార్ మీసాలతో షార్ట్ హెయిర్ తో కనిపిస్తున్నారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించడానికి తల వంచి ఎరగడే పాట పర్ఫెక్ట్.
 
ఫస్ట్‌క్లాస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో హై టెక్నికల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రసన్న జికె ఎడిటర్ గా, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
 
జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా రాయన్‌ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది.
 
తారాగణం: ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, SJ సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉంది : సునీతా విలియమ్స్

ఎర్ర కండువాను తెగ వాడేస్తున్న మెగా ఫ్యామిలీ హీరోలు

తొమ్మిదో సారి.. మళ్లీ బెంగుళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్

రేవ్ పార్టీలో దొరికిన హీరోయిన్ తరహాలో పారిపోయిన విడదల రజినీ!! (Video)

దసరా పండగ రాకుండానే సంక్రాంతి రైళ్లలో బెర్తులన్నీ ఫుల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

నాణ్యతకు భరోసా: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

తర్వాతి కథనం
Show comments