Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ట్రైలర్ విడుదల చేసిన విశ్వక్ సేన్

డీవీ
శుక్రవారం, 10 మే 2024 (15:06 IST)
S I T team with viswak sen
హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ మరియు రజత్ రాఘవ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ 'SIT'(సిట్ - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)అనే చిత్రంతో రాబోతున్నారు. SNR ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సిట్ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. VBR (విజయ్ భాస్కర్ రెడ్డి) దర్శకత్వంలో ఈ సిట్ సినిమా తెరకెక్కుతుంది. 
 
సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుండగా రజత్ రాఘవ్ కీలక పాత్రని పోషిస్తున్నారు. నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిట్ చిత్ర ట్రైలర్ ని యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు. విశ్వక్ సేన్ ట్రైలర్ చూసి చాలా ఆసక్తికరంగా ఉందని మూవీ యూనిట్ ని అభినందించారు.         
 
ఇక ఈ సిట్ చిత్ర ట్రైలర్ ను చూస్తుంటే..మొదట ఓ అమ్మాయి మర్డర్ కేసు నుంచి ఓపెన్ అయ్యి ఆ తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తే ఆ కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గరికి వస్తే అరవింద్ కృష్ణ ఎలా డీల్ చేశాడు అని సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్  కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో 'We Take The Words Duty, Honour and Compassion' అని తమ జాబ్ గురించి నిజాయితీ నిబద్దత కలిగిన పోలీసాఫీసర్ గా అరవింద్ కృష్ణ చెప్పడం హైలెట్ గా నిలిచింది.         
 
ఇక ఈ సిట్ చిత్రానికి బాలిరెడ్డి, రమేష్ గుండా, వాసిరెడ్డి నరేంద్ర సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరికుప్పల యాదగిరి మ్యూజిక్ అందిస్తుండగా జగదీశ్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా, కిరణ్ తుంపెర ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 
 
తారాగణం : అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ, నటాషా దోషి, రుచిత సాదినేని, అనిల్ రాథోడ్, కౌశిక్ మేకల.. తదితరులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

No More Ration Rice : మధ్యాహ్నా భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం

Delhi: ఢిల్లీపై భానుడు ప్రతాపం- వేడిగాలులు వీస్తూనే వుంటాయ్.. రెడ్ అలెర్ట్ జారీ

హనీమూన్ కేసు.. రాజా సూట్‌కేసులో మంగళసూత్రం, ఉంగరం.. సోనమ్ భర్తకు పెట్టిన షరతు?

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments