Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌కల్యాణ్‌గారిపై అభిమానంతో ప్రేమదేశపు యువరాణి విడుదల చేస్తున్నాం

Advertiesment
Yamin Raj, Virat Karthik, Arvind Krishna, Shiva Reddy
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (17:04 IST)
Yamin Raj, Virat Karthik, Arvind Krishna, Shiva Reddy
యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని అయిన సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఏజీఈ క్రియేషన్స్‌. ఎస్‌2మెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి,  హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మించిన ఈ చిత్రం పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో హీరో అరవింద్‌ కృష్ణ, శివారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
 
అరవింద్‌ కృష్ణ మాట్లాడుతూ ‘‘యామిన్‌ రాజ్‌, నేను కలిసి ఓ సిరీస్‌ చేశాం. తను ప్రతిభ ఉన్న నటుడు. ఈ సినిమాలో కూడా చక్కని నటన కనబర్చి ఉంటాడని నమ్ముతున్నా. టైటిల్‌, ట్రైలర్‌ నాకు బాగా నచ్చాయి. ట్రైలర్‌ చూశాక టైటిల్‌కు, ట్రైలర్‌కు సంబంధం లేదే అన్నట్లు అనిపించింది. అయితే ఆ ట్విస్ట్‌ ఏంటనేది తెరపై చూస్తేనే తెలుస్తుంది. అజయ్‌ పట్నాయక్‌ అద్భుతమైన సంగీతం అందించారు. ఆర్‌పీ, పట్నాయక్‌, సునీత గారు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అవుట్‌పుట్‌ నేను చూశా. చాలా థ్రిల్‌ అయ్యాను. ఎమోషన్స్‌ ఆకట్టుకున్నాయి. దర్శకుడు ప్రతిభకు నేను ఫిదా అయ్యాను. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు.
 
శివారెడ్డి మాట్లాడుతూ ‘‘సినిమా టైటిల్‌ పాజిటివ్‌గా ఉంది. సినిమాలో పాటలు ట్రైలర్‌ ఆకట్టుకునేలా అద్భుతంగా ఉన్నాయి. వినూత్న కథతో కొత్త టీమ్‌ చేసిన ఈ చిత్రం సక్సెస్‌ కావాలి’’ అని శివారెడ్డి చెప్పారు.
 
దర్శకుడు సాయి సునీల్‌ నిమ్మల మాట్లాడుతూ ‘‘ఎంతో కష్టపడితే దర్శకుడిగా నాకీ అవకాశం వచ్చింది. వారి కోసం కష్టపడి ఈ సినిమా చేశా. బ్లాక్‌బస్టర్‌ అయిందా లేదా అన్నది కాదు.. నిర్మాతకు డబ్బులు వస్తే అదే పెద్ద సక్సెస్‌. కొత్త జానర్‌ కథతో సినిమా చేశారు. నా టీమ్‌ ఎంతో కష్టపడ్డారు. పవన్‌కల్యాణ్‌ గారి మీదున్న అభిమానంతో ఆయన పుట్టినరోజున సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు.
 
హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ ‘‘సినిమాకు కథే ప్రాణం. దర్శకుడు బలమైన ప్రేమకథతో ఈ సినిమా  తీశారు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌, లవ్‌, డ్రామా అన్ని ఉన్నాయి. హీరోయిన్‌గా నా తొలి చిత్రమిది. హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు సినిమా క్రమశిక్షణ నేర్పింది : రియల్ హీరో సోనూ సూద్