Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నూపూర్ సనన్ ను ఏక్ దమ్ ఏక్ దమ్ అంటూ ఆటపట్టిస్తున్న టైగర్ నాగేశ్వరరావు

Advertiesment
Ravi Teja, Nupur Sanan
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (13:44 IST)
Ravi Teja, Nupur Sanan
టైగర్ నాగేశ్వరరావు సూపర్ ఎంటర్‌టైనింగ్, ఎనర్జిటిక్ అవతార్‌ ని పెప్పీ నంబర్ లో చూడటానికి సిద్ధం చేస్తున్నది చిత్ర టీం. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్‌లు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ ఏక్ దమ్ సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
 
అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ, నూపూర్ సనన్ రెట్రో అవతార్‌లలో కనిపించడం ఆకట్టుకుంది.  నుపుర్ తన చేతుల్లో పుస్తకాలు పట్టుకుని కాలేజీ విద్యార్థినిగా కనిపిస్తుంది. రవితేజ ఆమెను  ఆటపట్టించడం, బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్సర్‌లను కూడా గమనించవచ్చు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
 
ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ దండయాత్ర గ్లింప్స్ కి  అద్భుతమైన స్పందన లభించింది. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ ,  కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 
 రవితేజ కెరీర్ లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు’. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, సంగీతం జివి ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.  
 
తారాగణం: రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖుషీ ఖుషీగా విజయ్‌ దేవరకొండ, సమంతల ప్రేమ కథ : రివ్యూ