Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రవితేజ మళ్లీ జతకట్టనున్న శ్రీలీల..?

sree leela
, సోమవారం, 28 ఆగస్టు 2023 (17:22 IST)
పెళ్లి సందడి సినిమాతో తెలుగువారికి పరిచయమైంది శ్రీలీల. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా శ్రీలీల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో శ్రీలీల సర్ ప్రైజ్ చేసింది. 
 
ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో మరోసారి శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకోబోతోందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే డ్రామాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు. రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో నాలుగోసారి వస్తున్న ఈ చిత్రానికి శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. 
 
రవితేజ ఆర్టీ4జీఎమ్ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల గురించి అధికారిక ప్రకటన లేదు. దీంతో రవితేజ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ, శ్రీలీల కాంబో మళ్లీ రిపీట్ అయితే అంచనాలు మరింతగా పెరుగుతాయి.
 
అంతేకాదు ఈ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తుందని మరో టాక్ వినిపిస్తోంది. ఇక రవితేజ టైగర్ నాగేశ్వరరావు, డేగ సినిమాలతో బిజీగా ఉన్నాడు. శ్రీలీల చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విదేశాలకు వెళ్లినా ఖుషి పాటల గురించి మాట్లాడుతున్నారు : సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్