Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలతో త్రినాధ రావు నక్కిన చిత్రం ప్రారంభం

Advertiesment
sundeep kishan, clap by dil raju

డీవీ

, మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (15:40 IST)
sundeep kishan, clap by dil raju
'ఊరు పేరు భైరవకోన' విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ చిత్రం #SK30 కోసం ధమాకా దర్శకుడు త్రినాధ రావు నక్కినతో చేతులు కలిపారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ,  హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌లను అందించిన ప్రొడక్షన్ హౌస్ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయబోతోంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
 
webdunia
SK 30 movie team
ఈ రోజు, #SK30 గ్రాండ్‌గా ప్రారంభమైయింది. ముహూర్తం వేడుకకు విజయ్ కనకమేడల కెమెరా స్విచాన్ చేయగా, దిల్ రాజు క్లాప్‌ కొట్టారు. అనిల్ సుంకర తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.
 
త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ #SK30కి కథ, స్క్రీన్‌ప్లే  డైలాగ్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఈ కొత్త సినిమా త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.
 
సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, నిజార్ షఫీ డీవోపీగా పని చేస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుర్రహీరోను తాబేలు అనుకొని పొరపడిన పెద్ద హీరోలు - స్పెషల్ స్టోరీ