Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సందీప్ కిషన్, స్వరూప్ RSJ చిత్రం వైబ్ ఫస్ట్ లుక్

Advertiesment
Sandeep Kishan - Vibe First Look

డీవీ

, శనివారం, 30 మార్చి 2024 (16:00 IST)
Sandeep Kishan - Vibe First Look
కెప్టెన్ మిల్లర్, ఊరు పేరు భైరవకోన విజయాలతో క్లౌడ్ నైన్‌లో ఉన్న హీరో సందీప్ కిషన్, పాత్ బ్రేకింగ్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మేకర్స్ తో చేతులు కలిపారు. #SK31కి స్వరూప్ RSJ దర్శకత్వం వహిస్తుండగా, రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రొడక్షన్ నంబర్ 5గా నిర్మిస్తున్నారు.
 
తన మొదటి సినిమాతో ప్రశంసలు అందుకున్న స్వరూప్ ఆర్‌ఎస్‌జె మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. కథ ఎంపికలో మంచి అభిరుచి తో పాటు మంచి సాంకేతిక, నిర్మాణ విలువలతో కంటెంట్ బేస్డ్ సినిమాలను తీయడంలో పేరుగాంచిన  రాహుల్ యాదవ్ నక్కిన ఈ కొత్త చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  దీంతో ఈ బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
ఈ చిత్రానికి 'వైబ్' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. టైటిల్ లోగో సినిమా నేచర్ ని సూచిస్తూ హ్యాండ్ పంచ్‌గా డిజైన్ చేయబడింది. యుద్ధం ఎంత పెద్దదైనా, గెలవడం ఎంత కష్టమైనదైనా, ముఖ్యమైనది ఏమిటంటే, మీ పోరాటంలో మీ కోసం కొంతమంది స్నేహితులు ఉన్నారు, ఎందుకంటే మీరు వారితో 'వైబ్' వుంది.
 
ఫస్ట్ లుక్‌లో సందీప్ కిషన్ వైల్డ్ యాక్షన్ అవతార్‌లో కనిపించారు. తను సిటీలో అల్లర్లలో పాల్గొన్న అతని స్నేహితుల బృందంతో పాటు కనిపిస్తున్నారు. సందీప్ కిషన్ రక్తపు కత్తి, మోలోటోవ్ కాక్‌టెయిల్‌ని పట్టుకొని వున్నారు. అతని స్నేహితులు కూడా గాయాలతో ఆయుధాలు పట్టుకుని కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతంగా ఆకట్టుకుంటోంది.
 
“వైబ్” కాలేజ్ బేస్డ్ యాక్షన్-లవ్ స్టోరీ. ఇది ఒక స్టూడెంట్, అతని స్నేహితులు సాధారణ వ్యక్తుల నుంచి రెబల్‌గా మారడం వరకు జరిగిన కథ.
 
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. 2025 వేసవిలోవైబ్ ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడవి శేష్ నటిస్తున్న జి 2 అప్ డేట్ గుజరాత్‌లో ప్రారంభం