ఇటీవలే తన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి జి 2 సినిమా ప్రమోషన్ లో కొత్త ప్రచారాన్ని నెలకొల్పిన అడవి శేష్ నేడు హీరోయిన్ బనితాసంధు ఫొటో పెట్టి షూటింగ్ ప్రారంభం అంటూ క్లారిటీ ఇచ్చాడు. కొత్త షెడ్యూల్ గుజరాత్‌లోని భుజ్‌లో ప్రారంభమయింది. అడివిశేష్, బనితాసంధు ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. హీరోయిన్ బనితాసంధు సెల్ఫీని తీసుకుని పోస్ట్ చేసింది. ఈ లొకేషన్ లో గతంలో మగధీర సినిమాలో ఓ సీన్ తీశారు.
2018లో ఆడియన్స్ ముందుకు వచ్చి థ్రిల్ చేసిన స్పై యాక్షన్ మూవీ గూఢచారి. శశి కిరణ్ టిక్క డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్ ఇవ్వడం విశేషం. అప్పటినుంచి ఈ సినిమాకు ఫ్రాంచైస్ గా ఉంటే బాగుండు అనే భావన చిత్ర టీమ్ కు కలిగింది. దానివల్ల రెండో పార్ట్ వస్తుంది.
గత ఏడాది ఈ సినిమాకు సంబందించి ఓ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. ఇందులో అడవి శేష్ జేమ్స్ బాండ్ తరహాలో లుక్ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. ఇప్పటికీ మరలా ఈ సినిమా ఆరంభం అని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ బనితా సంధు హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. మేజర్ సినిమాకి ఎడిటర్ గా పని చేసిన వినయ్ కుమార్ ఈ సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తున్నారు.