Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్‌తో భీష్మ చేస్తూనే.. భారీగా పెంచేసిన రష్మిక మందన

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (11:25 IST)
నితిన్ తాజా సినిమా భీష్మ. నాగశౌర్యతో ‘ఛలో’ వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన వెంకీ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. భీష్మ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు సింగిల్ ఫర్ ఎవర్ అనేది ఉపశీర్షిక. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి నితిన్‌తో పాటు రష్మిక మందన దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. ఈ చిత్రానికి మణిశర్మ కొడుకు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఈ నెల 20 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా ద్వారా రష్మిక మందనకు మంచి గుర్తింపు వస్తుందని టాక్ వస్తోంది. 
 
ఇకపోతే.. గీత గోవిందం హీరోయిన్‌పై ప్రస్తుతం ఓ వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. రష్మిక పారితోషికాన్ని బాగా పెంచేసిందట. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండతో మళ్లీ జతకడుతోంది. ఈ చిత్రం డియర్ కామ్రేడ్‌గా తెరకెక్కుతోంది. ఇంకా తమిళంలో ఓ సినిమాలో కనిపిస్తోంది. 
 
అలాగే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో, అల్లు అర్జున్ సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేసింది. ఇలా వరుసగా ఆఫర్లు వెల్లువల్లా రావడంతో రష్మిక పారితోషికాన్ని పెంచేసిందని టాక్ వస్తోంది. ఇందులో భాగంగా ఒక సినిమా రూ.60లక్షల నుంచి రూ.80లక్షల వరకు డిమాండ్ చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఆమె రూ.40లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. అగ్ర హీరోయిన్‌గా ఎదగక ముందే రష్మిక భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments