Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టుల కోసం నేను... మా కుంటుంబం వుంది... మెగాస్టార్ చిరంజీవి

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (21:49 IST)
అడగనిదే అమ్మ అయినా పెట్టదని అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవిగారిని అడగకుండానే సినిమా జర్నలిస్టులను ఇంటికి ఆహ్వానించి మరీ వారి ఆరోగ్య భద్రతకు సహాయం చేశారు. మెగా మనసును చాటుకున్నారు. మార్చిలో ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ సభ్యులకు హెల్త్ కార్డులు, ఐడి కార్డులు అందజేసిన విషయం తెలిసిందే. 
 
ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిగారిని ఆహ్వానించగా… ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణలో బిజీగా ఉండటం వలన రాలేనని తెలిపారు. అసోసియేష‌న్‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.
 
 జర్నలిస్టుల సంక్షేమానికి ‘ఫిల్మ్ న్యూస్‌ క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవిగారు, బుధవారం ఉదయం అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు. అడ‌గ‌కుండానే తనవంతు సహాయం చేసి జ‌ర్న‌లిస్ట్‌ల‌ను ఆనందంలో ముంచెత్తారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సినిమా ప్రముఖులకు, ప్రేక్షకులకు టెలివిజన్ మీడియా, వెబ్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు వారధి లాంటివారు. ఈ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కృషి ప్రశంసనీయం. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వడం నాకు నచ్చింది. అలాగే, ఈ అసోసియేషన్ చేస్తున్న ఇతర సేవా కార్యక్రమాలు నాకు ఎంతగానో నచ్చాయి. అందుకని, నావంతుగా కొంత సహాయం చేస్తున్నాను. నేను ఇచ్చిన మొత్తాన్ని హెల్త్ కార్డుల కోసం వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే, జర్నలిస్టులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను, మా కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను” అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments