ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కేరళలో జరుగుతున్న 'సైరా' సినిమా షూటింగ్ బిజీ బిజీగా ఉన్నాడు. కేరళలో పది రోజులపాటు షూటింగ్ జరగనుంది. అక్కడ పూర్తయ్యాక తదుపరి హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. 'సైరా' తరువాత మెగాస్టార్ తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తారు. ఆపై త్రివిక్రమ్ సినిమా ఉంటుందని తెలిసింది.
ఈ రెండు సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవి మరో భారీ చిత్రాల దర్శకుడుగా పేరు పొందిన శంకర్‌తో సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మిస్తారని వినికిడి.
ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తే, తమిళంలో అజిత్ లేదా విజయ్ నటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కాలంటే మరో సంవత్సరమైనా పడుతుందని అంచనా. ఇది మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.