Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా నటన వెనుక అసలు రహస్యం ఇదే... రష్మిక మందన

Advertiesment
నా నటన వెనుక అసలు రహస్యం ఇదే... రష్మిక మందన
, గురువారం, 30 మే 2019 (15:50 IST)
నేటి తరం కథానాయికలు సహజమైన నటన కనబరచడంలో మంచి ప్రతిభ చూపుతున్నారు. డీగ్లామరస్ పాత్ర, ట్రెడీషనల్ పాత్ర ఏదైనా సరే ఇట్టే ఒదిగిపోతున్నారు.


ఇక ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమై, గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న కూడా వీరిలో ఒకరిగా చెప్పుకోవచ్చు. ఆమె నటించిన సినిమాలలో రష్మిక కంటే ఆమె పాత్ర ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే అంత త్వరగా క్రేజీగా హీరోయిన్‌గా మారిపోయింది.
 
నటనలో సహజత్వం కోసం ప్రత్యేకంగా ఏమైనా స్టెప్స్ తీసుకుంటూ ఉంటారా అని అడిగితే... ‘‘మొదటి సినిమా చేసే వరకు కూడా నాకు నటనలో అసలు ఓనమాలు కూడా రావు. పాఠశాలలో ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా డ్యాన్సులు చేసేదాన్ని కానీ నటనవైపు అస్సలు వెళ్లేదాన్ని కాదు.

ఒకే ఒకసారి మాత్రం ప్రయత్నించినా నటించలేకపోయా. ఇక అప్పటి నుండి నటన జోలికి వెళ్లలేదు. అయితే అలా నాకు అప్పట్లో నటన తెలియకపోవడమే ఇప్పుడు నాకు ప్లస్ అయిందేమో. 
 
మొదటి సినిమా కోసం కెమెరా ముందు నిలబడినప్పుడు నాలా నేను కనిపించాలనుకున్నా. ఆర్టిఫిషియల్ నటన కనబరుస్తూ ప్రత్యేకంగా హావభావాలు పలికించకుండా సన్నివేశంలోని సందర్భం నిజంగా నాకే ఎదురైతే ఎలా స్పందిస్తానో ఊహించుకుంటూ అందుకు తగ్గట్టుగా నటించాను.

అలా చేయడం వలనే నాలో ఒరిజినాలిటీ బయటికి వచ్చింది. నా పాత్రల్లో కనిపించే సహజత్వం వెనుక అసలు రహస్యం అదే’’ అని చెప్పింది రష్మిక.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ బయోపిక్ తీస్తానంటున్న పూరీ జగన్నాథ్...