నేనేమీ చట్టవిరుద్ధమైన పనులు చేయడం లేదు : యాంకర్ రష్మీ

వరుణ్
బుధవారం, 24 జనవరి 2024 (10:54 IST)
తానేమీ చట్టవిరుద్ధమైన పనులు చేయడం లేదని బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్ అన్నారు. పైగా, తనను విమర్శించిన నెటిజన్‌‍పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయడం లేదన్నారు. ఆ నెటిజన్‌కు రష్మీ గౌతమ్ ఇలా కౌంటర్ ఇవ్వడానికి కారణం లేకపోలేదన్నారు. అయోధ్య రామ మంది ప్రారంభోత్సవంపై రష్మీ గౌతమ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు.
 
'అసభ్యకర పనులు చేసి భగవంతుడి నామాన్ని జపిస్తే అన్ని తుడిచిపెట్టుకుపోతాయా..?' అని అన్నాడు. దీనిపై ఆమె స్పందించారు. 'నేనేమైనా డబ్బులు ఎగ్గొట్టానా? కుటుంబ బాధ్యత మరిచి తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేశానా? ట్యాక్సులు చెల్లించడం లేదా? చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నానా? మీ దృష్టిలో అసభ్యకరమైన పనులంటే ఏమిటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు ఎక్కువగా వింటున్నా. నా వరకు భగవంతుడు సర్వాంతర్యామి. సనాతన ధర్మంలోని మంచి విషయం అదే' అని బదులిచ్చారు. 
 
కాంగ్రెస్ గూటికి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? తర్వాత ఏమన్నారంటే.... 
 
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ఆ పార్టీకి బొటాబొటీ మెజార్టీతో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటూ భారత రాష్ట్ర సమితి నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇది తెలంగాణాలో సంచలనంగా మారింది. 
 
ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసిన వారిలో సునీతా లక్ష్మారెడ్డి, కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, గూడెం మహీపాల్ రెడ్డి, మాణిక్ రావులు ఉన్నారు. మెదక్ జిల్లాకు చెందిన వీరంతా ముఖ్యమంత్రి నివాసంలో కలిసి, తమ జిల్లా అభివృద్ధికి సహకరించాలని సీఎంను కోరారు. కానీ, బయటమాత్రం మరో తరహా ప్రచారం సాగుతుంది. ఈ నలుగురుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. 
 
వీరి కలయిక రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యలు వివరణ ఇచ్చారు. తాము ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధితో పాటు తనతమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. అనవసరంగా ఎలాంటి ఊహాగానాలు వద్దని మీడియాకు హితవు పలికారు. ఆ తర్వాత ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశారు. 
 
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అదనపు భద్రత ఇవ్వాలని కోరారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాలలో లేదా పర్యటనలలో పోలీస్ ఎస్కార్టులు తొలగిస్తున్నారని వారు నిఘా అధిపతికి ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పాటించకపోతే శాంతిభద్రత సమస్య ఉత్పన్నమవుతుందని వారు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments