గత 47 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత వర్ష బీభత్సం చెన్నై మహానగరాన్ని ముంచెత్తింది. నగర రోడ్లు వాగులు, వంకల్లా మారిపోయాయి. దాదాపు 48 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు భారీ వర్షాలకు మూగజీవాలు అతలాకుతలమయ్యాయి. వరదలో కొట్టుకుపోతున్న ప్రాణులను నగర ప్రజలు కాపాడి వాటిని తమ ఇంటిలోకి తీసుకెళ్లి ఆహారాన్ని పెడుతున్నారు.
వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మూగజీవుల ప్రాణాలను రక్షిస్తున్న వారికి నెటిజన్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.