Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగ్గుబాటి ఇంట రోకా వేడుక.. డిసెంబరులో రానా పెళ్లి!

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (08:55 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర నిర్మాతల ఫ్యామిలీల్లో ఒకటైన దగ్గుబాటి కుటుంబంలో త్వరలోనే ఓ పెళ్లి వేడుక జరుగనుంది. అది ఎవరిదో కాదు.. టాలీవుడ్ హీరో కమ్ విలన్‌గా అద్భుతంగా రాణిస్తున్న రానా దగ్గుబాటిది. ఈయన మిహీకా బజాజ్ అనే డిజైనర్‌తో ప్రేమలోపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఇటీవల వెల్లడించారు. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని మరిచిపోకముందే.. దగ్గుబాటి ఇంట మరో వేడుక జరిగింది. అదే రోకా వేడుక. 
 
అంటే, రానా - మిహీక పెళ్లి సందడిలో భాగంగా, దగ్గుబాటి కుటుంబానికి చెందిన రామానాయుడు స్టూడియోలో బుధవారం సాయంత్రం ఈ రోకా వేడుకని నిర్వ‌హించారు. అంటే పెద్ద‌లు స్వీట్లు, గిఫ్ట్స్‌ ఇచ్చి పుచ్చుకొని పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ కార్య‌క్రమంలో ఇరు కుటుంబ‌ పెద్ద‌లు నిశ్చయ తాంబూలాలు కూడా మార్చుకున్నారు. 
 
ఈ వేడుకలో హీరో వెంక‌టేష్ కుటుంబ సభ్యులు, అక్కినేని నాగచైతన్య కుటుంబాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ద‌గ్గుబాటి ఫ్యామిలీతో పాటు బ‌జాజ్ ఫ్యామిలీ క‌లిసి దిగిన గ్రూప్ ఫోటోని రానా దగ్గుబాటి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, డిసెంబరు నెలలో రానా - మిహీకాల వివాహం జరుగనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments