Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుద్దాల అశోకతేజకు అస్వస్థత - కాలేయ మార్పిడి చికిత్స చేయాలట?! (video)

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (08:46 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత, అశోక్ తేజ తీవ్ర అస్వస్థతులోనయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు విధిగా కాలేయ మార్పిడి చికిత్స చేయాల్సివుంటుందని వైద్యులు వెల్లడించారు. 
 
తన సొంత ఊరు సుద్దాల‌ని త‌న ఇంటి పేరుగా మార్చుకున్న ఈయ‌న 'నమస్తే అన్న' చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్‌కి సుద్దాల‌ మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. 
 
అయితే, ఆయనది బీ నెగెటివి రక్తగ్రూపు కావడంతో ఆపరేషన్ సమయంలో అధిక మోతాదులో రక్తం కావాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ గ్రూపు రక్తాన్ని సేకరించే పనిలో సుద్దాల అశోక తేజ సన్నిహింతులు ఉన్నట్టు సమాచారం. 
 
అయితే, లాక్డౌన్ కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రక్తం కొరత ఎక్కువగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో ఇటీవలే పలువురు సినీ హీరోలతోపాటు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా రక్తదాన చేసి.... ఇతరులు కూడా రక్తదానం చేసేందుకు ముందుకురావాలంటూ పిలుపునిచ్చారు. 
 
కాగా, నటుడు తనికెళ్ళ భరణి వంటి నటుల ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. ఎన్నో అద్భుత‌మైన గేయాల‌తో అల‌రించిన ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. 
 
దర్శకరత్న దాసరి నారాయణ రావు తీసిన రాములమ్మ చిత్రంలోని పాటలన్నీ రాశారు. ఈ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం విజయానికి అశోక తేజ గేయ రచనే అని చెప్పొచ్చు. పైగా, ఈ చిత్రంలో ఆయన ఓ పాటను కూడా పాడారు. 
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments