రానా పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చిన తండ్రి సురేష్ బాబు

గురువారం, 14 మే 2020 (12:46 IST)
తెలుగు టాప్ హీరో రానా దగ్గుబాటి. ఆయన తండ్రి సురేష్ బాబు దగ్గుబాటి. అగ్ర నిర్మాతల్లో ఒకరు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత. ఈయనకు ఇద్దరు కుమారులు. రానా దగ్గుబాటి ఒకరుకాగా, మరొకరు అభిరామ్ దగ్గుబాటి. 
 
అయితే, పెద్ద కుమారుడు రానా.. మిహీక బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించగా, ఆ అమ్మాయి కూడా రానాకు ఓకే చెప్పేసింది. ఈ విషయాన్ని రానానే స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ట్విట్ చేశారు. ఈ ట్వీట్‌తో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత శతమానం భవతి అంటూ దీవించసాగారు. 
 
ఈ నేపథ్యంలో తన కుమారుడు ప్రేమ పెళ్లిపై ఆయన తండ్రి సురేష్ బాబు స్పందించారు. రానా వివాహాన్ని డిసెంబర్‌లో జరుపనున్నట్లు తెలిపారు. 'రానా, మిహీకా బజాజ్‌ మధ్య చాలా కాలంగా పరిచయముంది. వారి నిర్ణయం పట్ల మా కుటుంబమంతా సంతోషంగా ఉంది.  
 
డిసెంబర్‌లో రానా  పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. అంతకంటే ముందుగానే వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లాక్డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటూ పెళ్లి ఏర్పాట్లను ప్లాన్‌ చేస్తున్నాం. సరైన సమయం వచ్చినపుడు ఆ వివరాల్ని వెల్లడిస్తాం' అని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం లూసిఫర్ రీమేక్‌లో త్రిష.. మళ్లీ మెగాస్టార్ సరసన చెన్నై చంద్రం..