Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'భల్లాలదేవ' మనసు దోచిన అందాల భామ ఎవరు?

Advertiesment
'భల్లాలదేవ' మనసు దోచిన అందాల భామ ఎవరు?
, బుధవారం, 13 మే 2020 (09:31 IST)
దగ్గుబాటి రానా అలియాస్ భల్లాలదేవ. టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరో. ఈయన మన్మథ బాణ ప్రయోగం జరిగింది. ఫలితంగా ఓ అమ్మాయికి మనసిచ్చేశాడు. సినిమాల్లో అత్యంత క్రూరమైన విలనిజం ప్రదర్శించే భల్లాలదేవ మనసును దోచుకున్న ఆ అందాల భామ ఎవరబ్బా అంటూ నెటిజన్లు సెర్చింజన్‌లో శోధించారు. చివరకు ఆ అమ్మాయి వివరాలను కనిపెట్టారు. ఇంతకీ ఆ అమ్మాయి పేరు మిహీక బజాజ్. 
 
నిజానికి గతంలో రానాపై అనేక పుకార్లు వచ్చాయి. ఆ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడనీ, ఈ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ, ఈ పుకార్లపై రానా ఏనాడా స్పందించలేదు. ఫలితంగా అవన్నీ వచ్చినంత త్వరగా అంతర్థానమయ్యాయి. అయితే ఈసారి రానానే స్వయంగా తన ప్రేయసిని పరిచయం చేయడంతో అటు టాలీవుడ్, ఇటు అభిమానులు ఆశ్చర్యపోయారు. 
 
ఇంతకీ రానా మనసు దోచిన అందాల భామ ఎవరంటే.. మిహీక స్వస్థలం హైదరాబాదే. కానీ ముంబైలో ఇంటీరియర్ డిజైనరుగా పనిచేస్తోంది. అలాగే, డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్ కంపెనీని కూడా నడుపుతోంది. ఈ సంస్థ ప్రధానంగా సెలబ్రిటీ వివాహాల నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. 
 
ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటే అమితమైన మక్కువ చూపే మిహీక ముంబైలోని రచన సంసద్ విద్యాలయం నుంచి ఇంటీరియర్ డిజైనింగులో డిప్లొమా పట్టా పొందారు. లండన్‌లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్‌లో ఎంఏ చేసింది.
 
ఇక మిహీక తల్లిదండ్రుల విషయానికొస్తే వారు హైదరాబాద్ నగరంలోనే క్రస్లా బ్రాండ్ పేరిట జ్యుయెలరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తండ్రి పేరు సురేశ్ బజాజ్, తల్లిపేరు బంటీ బజాజ్. మిహీక తల్లి బంటీ మంచి జ్యుయెలరీ డిజైనర్‌గా పేరుంది. 
 
ఆమె హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యాభ్యాసం చేశారు. మొదట్లో తల్లితో కలిసి వెడ్డింగ్ ప్లానర్‌గా పనిచేసిన మిహీక ఆపై సొంతంగా ఈవెంట్లు చేపడుతూ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
 
మిహీకకు సమర్థ్ బజాజ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. క్రస్లా బ్రాండ్ కార్యకలాపాలన్నీ అతడే చూసుకుంటున్నాడు. సమర్థ్ వివాహం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రావల్ సోదరి సాషాతో జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మన్మథ' బాణానికి పడిపోయిన బలశాలి 'భల్లాలదేవుడు'