Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభన్ హీరోగా రమేష్ గోపిల చిత్రం

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (17:21 IST)
Sobha, gopi, ravi
శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్, గోపిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్పీ క్రియేషన్ బ్యానర్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవంలో రచ్చ రవి, హీరో రామన్, విక్రమ్, చంద్ర వట్టికూటి, మోహన్, మధు పగడాల, డాక్టర్ కృష్ణమూర్తి, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సినిమా గురించి దర్శకులు  వివరాలు తెలియచేస్తూ, మేము దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. మేము ఇదివరకే హీరో తరుణ్ తో `ఇది నా లవ్ స్టోరీ`, ఆ తరువాత `రెడ్డి గారింట్లో రౌడీయిజం` తీశాం,  అది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఈ మద్యే కన్నడలో ఓ సినిమా చేశా. అది కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సో ఇది మా నాలుగో సినిమా.

ఈ చిత్రం ద్వారా శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూన్నాం, తాను ఇప్పటికే యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్ లాంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. ఈ సినిమా లవ్, సస్పెన్సు ఎంటర్ టైనర్ గా ఉంటుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించాం. లాక్ డౌన్ ఎత్తివేయగానే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రానికి సంబందించిన మిగతా నటీనటుల టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిచేస్తాం. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments