Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్‌లది 'ప్రేమ కాదంట'

Advertiesment
అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్‌లది 'ప్రేమ కాదంట'
, ఆదివారం, 30 మే 2021 (12:47 IST)
మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్ జంటగా ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. హీరో అల్లు శిరీష్ పుట్టినరోజు (మే 30) సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు.. టైటిల్‌ను రిలీజ్ చేశారు. 
 
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో.. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై శిరీష్ 6వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రీ లుక్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. 
 
తాజాగా ఫస్ట్ లుక్ అంటూ రెండు పోస్టర్స్ చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ రెండూ.. రొమాంటిక్‌గా ఉండటమే కాకుండా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. వినూత్న కథలకే ఇంపార్టెన్స్ ఇచ్చే అల్లు శిరీష్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా ఆకర్షిస్తుండటంతో.. సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. 
 
మరోవైపు, ప్రీలుక్, నిర్మాణ సంస్థ, హీరోహీరోయిన్లు మినహా.. ఏ ఒక్కరి ప్రేలను బహిర్గతం చేయలేదు. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్స్‌లో చిత్ర దర్శకుడి పేరు కూడా మేకర్స్ రివీల్ చేశారు. 
 
ఈ చిత్రానికి ‘జతకలిసే‘, కల్యాణ్ దేవ్ ‘విజేత’ చిత్రాలను డైరెక్ట్ చేసిన రాకేష్ శశి దర్శకుడు. ఇద్దరు సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆర్ఆర్ఆర్' శాటిలైట్ రైట్స్ జీ గ్రూప్ సొంతం.. బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?