Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభినయ 'దొరసాని' ... "పంచతంత్రం" చిత్రంలో ప్రధాన పాత్రలో..

Advertiesment
అభినయ 'దొరసాని' ...
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (12:19 IST)
సీనియర్ నటి జీవితా రాజశేఖర్ కుమార్తెల్లో ఒకరు శివాత్మిక రాజశేఖర్. దొరసాని చిత్రం ద్వారా వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రంలో అందం, అమాయకత్వం కలబోసిన నాయికగా యువతరం హృదయాల్ని దోచుకుంది. 
 
ప్రస్తుతం ఆమెకు తెలుగుతో పాటు తమిళంలో కూడా కొత్త చిత్రాల అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. గురువారం కథానాయిక శివాత్మిక జన్మదినం. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను అడివి శేష్‌ విడుదల చేశారు. 
 
ఆ తర్వాత చిత్ర కథ గురించి మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరి జీవితాన్ని నిర్దేశించే పంచేంద్రియాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఐదు ఇంద్రియాల నుంచి వ్యక్తమయ్యే భావోద్వేగాలతో సాగుతుంది. నేటి యువతరం ఆలోచనలు, దృక్పథాలకు అద్దం పడుతుంది. ఈ సినిమాలో లేఖ పాత్రలో శివాత్మిక కనిపిస్తుంది. అభినయానికి ఎంతో ఆస్కారమున్న పాత్ర అమెది' అని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ, లేఖ పాత్ర తనకెంతో ప్రత్యేకమని శివాత్మిక చెప్పింది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్న వేషాలు,, డబ్బింగులు చెబుతూ, నిర్మాత స్థాయికి ఎదిగిన ఏడిద నాగేశ్వ‌ర‌రావు