Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్న వేషాలు,, డబ్బింగులు చెబుతూ, నిర్మాత స్థాయికి ఎదిగిన ఏడిద నాగేశ్వ‌ర‌రావు

ఏప్రిల్ 24 న ఆయ‌న 87వ జయంతి

చిన్న వేషాలు,, డబ్బింగులు చెబుతూ, నిర్మాత స్థాయికి ఎదిగిన ఏడిద నాగేశ్వ‌ర‌రావు
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (11:57 IST)
edida, chiru, viswanath
శంకరాభరణం, సాగరసంగమం, స్వయంకృషి, స్వాతిముత్యం, ఆపత్బాంధవుడు, సితార, సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర చిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు 87వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం. కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున, ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ, నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు. 
 
అలాంటి సమయంలో 1976లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతలు వహించి మంచి విజయం సాధించారు. ఆ విజయం ఇఛ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు . అది మంచి విజయం సాధించింది .తదుపరి చిత్రం కళా తపస్వి కే. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం. తెలుగు చిత్ర ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకు వెళ్లిన అద్భుత కావ్యం. ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు, box office కలెక్షన్స్ గాని, జాతీయ, అంతర్జాతీయ, రాష్త్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే, అతిశయోక్తి కాదు. 
 
webdunia
Edida movies
జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం. అలాగే ఏ దేశ‌మెళ్లినా శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో. ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ఇన్స్పిరేషన్. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది  ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కే.విశ్వనాధ్ కాంబినేషన్ లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అవార్డులు తో పాటు రివార్డులు సొంతం చేస్కుకున్నదీ చిత్రం. తెలుగు, తమిళం & మలయాళంలో ఒకేసారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. తదుపరి చిత్రం మరో క్లాసిక్ - సితార. ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వంలో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ever green classic . సితార కి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది. ఇక స్వాతిముత్యం - కే.విశ్వనాధ్ కమలహాసన్ రాధికల కలయికలో వచ్చిన ఆణిముత్యం  1986 లో విడులయ్యిన ఈ చిత్రం, అప్పటికి బాక్స్ ఆఫీస్ records ని బీట్ చేసింది. జాతీయ అవార్డు, రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం. 
 
webdunia
with late president
ఇక స్వయంకృషి- మెగాస్టార్ చిరంజీవితో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా, ఓ సాధారణ చెప్పులు కొట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే. అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద. మంచి విజయం సాధించిన ఈ చిత్రం, చిరంజీవి కి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది. ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరోగా చేసిన స్వరకల్పన ఆశించనంతగా ఆడలేదు. మళ్ళీ విశ్వనాధ్, చిరంజీవిలతో తీసిన చిత్రం ఆపత్బాంధవుడు . చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ. రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచంలో మిస్ అయ్యింది. ఇన్ని గొప్ప చిత్రాలు నిర్మించడానికి సాహసించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారికి, మన ప్రభుత్వం తరపున సరైన గుర్తింపు లభించలేదు అంటే సినీ అభిమానులకు చాలా నిరాశే. పద్మ అవార్డుల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డుకి కానీ ఆయన అన్నివిధాలా అర్హులే. కనీసం కీర్తిశేషులైన తర్వాత ఆయనకీ తగిన విధముగా పురస్కారం మన తెలుగు ప్రభుత్వాలు అందిస్తే, చిత్ర సీమలో ఆయన చిత్రాలు ఎలాగైతే మరపురాని ఆణిముత్యాల్లా మిగిలాయో, అలాగే ఆయన కీర్తి ప్రతిష్టలను గౌరవించిన వారౌతారు .
 
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్
సిరి సిరి మువ్వ
తాయారమ్మ బంగారయ్య
శంకరాభరణం
సీతాకోకచిలక
సాగర సంగమం
స్వాతిముత్యం
సితార
స్వయంకృషి
స్వరకల్పన
ఆపత్బాంధవుడు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ మృతి..