కరోనా కష్టకాలంలో మరలా భౌతిక దూరం పాటించాల్సి వస్తోంది సినిమా పరిశ్రమ. ఇప్పటికే దాదాపు 8నెలలుపైగా షూటింగ్ లేక ఇంటివద్దకే పరిమితమైన సినిమారంగంలోని 24 శాఖల కార్మికులుకు మరోసారి ఇంటివద్దనే గడిపే స్థితి నెలకొంది. గత రెండురోజులుగా దేశంలో జరుగుతున్న పెను మార్పుల దృష్ట్యా తెలుగు సినిమా పరిశ్రమ కఠినమైన నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన నోట్‌ను అన్ని శాఖలకు పంపింది.
అందులో ఏముందుంటే, ఇది అందరికీ సంబంధించిన విషయం. ప్రస్తుతం ఉన్న కరోనా పాండమిక్ కండిషన్ లో, అవసరమైన మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్ / పోస్ట్ ప్రొడక్షన్స్ అత్యవసరం అనుకుంటే తప్పని పరిస్తుతులలో 50 మంది కార్మికులతో మాత్రమే చేసుకోవాలి . అందరినీ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకొవడం జరిగిందని తెలిపారు .
`వకీల్‌సాబ్` సినిమా విడుదలకు ముందే కరోనా మహమ్మారి విజృంభణ వున్న దరిమిలా థియేటర్లను మూసివేస్తారనే టాక్ రావడంతో చాలా సినిమాలు వాయిదా వేసుకున్నాయి. అయితే మూసే ప్రసక్తేలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా, యాభై శాతం ఆక్యుపెన్సీ కింద రన్ చేసుకోవచ్చని సూచన ప్రాయంగా తెలిపింది. అదెలా వున్నా ఇప్పుడు నిర్మాతలమండలి మాత్రం యాభైశాతం సభ్యులతోనే షూటింగ్ చేసుకోవచ్చని నోటీసు పంపింది.