Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజీవ్ సాలూర్ కొత్త చిత్రం

Advertiesment
రాజీవ్ సాలూర్ కొత్త చిత్రం
, బుధవారం, 14 ఏప్రియల్ 2021 (11:19 IST)
Rajiv Salur, Varsha, KS Ramarao
వెరైటీ చిత్రాలతో ఆకట్టుకున్న రాజీవ్ సాలూర్ కొత్త చిత్రం ఉగాది పండుగను పురస్కరించుకుని పూజ కార్యక్రమాలతో మొదలైంది. వర్ష హీరోయిన్గా నటిస్తుంది. ఆర్కే నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ని ఎస్.ఆర్.కె బ్యానర్ పతాకంపై శివ రామ కృష్ణ జి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సత్య సిరికి ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. సంతోష్ సనమోని సినిమా అందిస్తుండగా, రోషన్ సంగీతం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత న‌ట్టి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టారు. 
 
చిత్ర నిర్మాత శివ రామ కృష్ణ జి మాట్లాడుతూ, ఎంతో వెరైటీ క‌థ‌గా రాబోతుంది. దర్శకుడు ఆర్కే నల్లూరి చెప్పిన కథ బాగుంది. కథ అనుకున్నప్పుడే రాజీవి సాలూర్ హీరోగా చేయాలనీ డిసైడ్ అయ్యాము..ఈ సినిమా మా అందరికి మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశిస్తున్నాg.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు..
 
దర్శకుడు ఆర్కే నల్లూరి మాట్లాడుతూ, ఈ కథ అందరిని మెప్పించే సినిమా అవుతుంది.. త్వరలోనే ఓ మంచి సినిమా మీముందుకు తీసుకొస్తాం. హీరో రాజీవ్ సాలూర్ ఈ సినిమా ని ఒప్పుకోవడం ఆనందంగా ఉంది అన్నారు..
 
హీరో రాజీవి సాలూరి మాట్లాడుతూ, కథ వినగానే సినిమా చేయాలనీ ఎంతో ఇంట్రెస్ట్ వచ్చింది. కథలో చాలా మలుపులు ఉన్నాయి..దర్శకుడు చెప్పిన విధానం బాగుంది. నన్ను హీరోగా ఎంపిక చేసినందుకు నిర్మాత శివ రామ కృష్ణ జి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పుష్ప'రాజ్‌ను డైరెక్ట్ చేయనున్న 'ఆచార్య' దర్శకుడు!