కోహ్లీ బయోపిక్‌ ఛాన్స్ వస్తే వదలను.. సల్మాన్ నన్ను భేటా అని పిలుస్తారు!?

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (19:47 IST)
లాస్ ఏంజిల్స్‌లో ఇటీవల నిర్వహించిన ఆస్కార్ అవార్డ్ షోకు హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారత్‌కు తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. రామ్ చరణ్ న్యూఢిల్లీలో జరిగిన కాన్‌క్లేవ్‌లో అనేక రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. 
 
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నా. భవిష్యత్తులో తప్పకుండా క్రీడలకు సంబంధించిన సినిమా చేస్తానని రంగస్థలం స్టార్ చెర్రీ అన్నారు. విరాట్‌ కోహ్లి బయోపిక్‌పై అడిగిన ప్రశ్నకు రామ్‌చరణ్‌ బదులిస్తూ, అవకాశం ఇస్తే తప్పకుండా కోహ్లీ బయోపిక్‌లో నటిస్తానని చెప్పాడు.
 
వెండితెరపై కోహ్లి పాత్రలో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు చెర్రీ తెలిపాడు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ అంటే తనకు ఇష్టమని, ఎప్పుడు ముంబై వచ్చినా కిక్ స్టార్‌ని కలుస్తుంటానని చెప్పాడు. సల్మాన్ తనను బేటా అని ముద్దుగా పిలుచుకుంటాడని చెప్పాడు.
 
రామ్ చరణ్ తదుపరి రాజకీయ ఆధారిత చిత్రం RC15లో కనిపించనున్నారు. దీనికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కబీర్ సింగ్ ఫేమ్ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments