Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే స్టేషన్ టీవీల్లో పోర్న్ వీడియోలు - 3 నిమిషాల పాటు టెలికాస్ట్

Advertiesment
రైల్వే స్టేషన్ టీవీల్లో పోర్న్ వీడియోలు - 3 నిమిషాల పాటు టెలికాస్ట్
, సోమవారం, 20 మార్చి 2023 (13:08 IST)
కొందరు రైల్వే సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. ఫలితంగా కొన్ని జరగకూడని విషయాలు జరుగుతున్నాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‌లోని పదో నంబరు ఫ్లాట్‌ఫాంపై ఉండే టీవీల్లో పోర్న్ వీడియోలు ప్రసారమయ్యాయి. ఏకంగా మూడు నిమిషాల పాటు ఈ పోర్న్ వీడియో ప్రసారం కావడంతో ప్రయాణికులంతా విస్తుపోయారు. ఆ తర్వాత తేరుకున్న రైల్వే స్టేషన్ అధికారులు ఆ వీడియో ప్రసారాలను నిలిపివేశారు. ఈ ఘటనపై వేగంగా స్పందించిన రైల్వే అధికారులుటీవీలను ఏర్పాటు చేసిన సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు.
 
ఆదివారం ఉదయం పాట్నా రైల్వే స్టేషన్‌లో ఉదయం 9.30 గంటల సమయంలో మూడు నిమిషాల పాటు పోర్న్ వీడియోలు ప్రసారమవ్యాయి. స్టేషన్‌లో అమర్చిన పలు టీవీ స్క్రీన్‌లపై ఒక్కసారిగా పోర్న్ దృశ్యాలు కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా, మహిళలు ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియోలను చూసిన కొందరు గవర్నమెంట్ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు ఫిర్యాదు చేశారు. 
 
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ పోర్న్ వీడియో ప్రసారాలను నిలిపివేశారు. దీనిపై రైల్వే స్టేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. టీవీలను ఏర్పాటు చేసిన దత్తా కమ్యూనికేషన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు అపరాధం కూడా విధించారు. ఆ సంస్థతో ఉన్న కాంట్రాక్టును కూడా రైల్వే శాఖ రద్దు చేసింది. పైగా, ఈ ఘటనపై రైల్వే శాఖ కూడా స్వతంత్ర దర్యాప్తును చేపట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత