Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానుల‌కు రామ్ చరణ్ బ‌హిరంగ లేఖ...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (10:23 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ విన‌య విధేయ రామ‌. డి.వి.వి.దాన‌య్య నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. ఈ సినిమా అంచ‌నాల‌ను ఏమాత్రం అందుకోలేక‌పోయింది. అభిమానుల‌ను బాగా నిరాశప‌రిచింది. ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ గురించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. 
 
ప్రియ‌మైన అభిమానులు మ‌రియు ప్రేక్ష‌కుల‌కు...
నా ప‌ట్ల మ‌రియు నా సినిమాల ప‌ట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానాల‌కు విన‌మ్ర‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. మా విన‌య విధేయ రామ సినిమా కోసం రేయింబ‌వ‌ళ్లు క‌ష్టించిన సాంకేతిక నిపుణులు అంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు. నిర్మాత దాన‌య్య గారు అందించిన స‌హ‌కారం మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనిది. మా చిత్రాన్ని న‌మ్మిన పంపిణీదారులు మ‌రియు ప్ర‌ద‌ర్శ‌న‌దారుల‌కి కృత‌జ్ఞుడై ఉంటాను. 
 
మీ అంద‌రికీ న‌చ్చి మిమ్మ‌ల్ని వినోదింప చేసే సినిమా అందించ‌టానికి మేమంతా ఎంత‌గానో శ్ర‌మించాం. దుర‌దృష్ట‌వ‌శాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాని అందించ‌లేక మీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాం. మీరు చూపించే ఈ ఆద‌ర‌ణ అభిమానాన్ని ప్రేర‌ణ‌గా తీసుకుని భ‌విష్య‌త్తులో మీకు న‌చ్చే మీరు మెచ్చే సినిమాలు చేయ‌టానికి శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాను. అన్నివేళ‌ల త‌మ మ‌ద్ద‌తు నాకు అందించిన మీడియా మిత్రుల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. మీరు ఎల్ల‌ప్పుడూ చూపించే ఈ ప్రేమ మ‌రియు అభిమానానికి ధ‌న్య‌వాదాలు
 
ప్రేమ‌తో
మీ 
రామ్ చ‌ర‌ణ్.
 
సంక్రాంతికి విన‌య విధేయ రామ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం.. ఫ్లాప్ అవ్వ‌డం తెలిసిందే. అంతా మ‌ర‌చిపోయారు అనుకుంటున్న టైమ్‌లో ఇప్పుడు ఈ బ‌హిరంగ లేఖ రాయ‌డం ఏమిటో..? ఈ లెట‌ర్ వెన‌కున్న లాజిక్ ఏంటో..? చ‌ర‌ణ్‌కే తెలియాలి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments