Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళికి ప్ర‌శంస‌లు ద‌క్కించిన రామ్ చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌.ల ట్విన్స్ డాన్స్

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (16:47 IST)
Chiru-Mehar ramesh-rrr dance
నిన్న విడుద‌ల చేసిన రౌద్రం, ర‌ణం, రుదిరం (ఆర్‌.ఆర్‌.ఆర్‌.) సినిమాలోని డాన్స్ వీడియోకు ఊహించ‌ని స్పంద‌న వ‌చ్చింది. రాజ‌మౌళి ఆలోచ‌న‌లోంచి వ‌చ్చిన `నాటు నాటు..` పాట‌కు తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌తోపాటు బాలీవుడ్‌లోనూ క్రేజ్ వ‌చ్చేసింది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌.ల‌ను ట్విన్స్‌లాగా చూపిస్తూ వారి డ్రెస్ కోడ్ కూడా అలానే వేయించి స్టెప్‌లు ఒకేలా వేయ‌డం ఆక‌ట్టుకుంది. దీనిపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ పాట‌తోనే రాజ‌మౌళి మాస్ ప్రేక్ష‌కుల‌ను ట‌చ్ చేశాడ‌నీ, ఇద్ద‌రూ క‌లిసి ఒకేలా డాన్స్ వేయ‌డం అనే ప్ర‌క్రియ‌కు హాట్సాప్ చెబుతున్న‌ట్లు పేర్కొంటున్నారు.
 
ఈనెల 16న తెలుగు చ‌ల‌న‌చిత్ర ద‌ర్శ‌కుల సంఘం ఎన్నిక‌ల జ‌ర‌గబోతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఏ ద‌ర్శ‌కుడు ఒక‌రినొక‌రు క‌లిసినా రాజ‌మౌళి గురించే ప్ర‌స్తావ వ‌స్తోంది. 
 
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సినిమా భోలా శంక‌ర్ ఓపెనింగ్‌లోనూ చిరంజీవి హాజ‌ర‌య్యారు. ఆయ‌న అయ్య‌ప్ప మాల ధ‌రించారు. కె.రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ కొట్టారు. ఈ సంద‌ర్భంగా చిన్న గేప్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్. పాట గురించి చిరంజీవికి రాఘ‌వేంద్ర‌రావు చెప్ప‌డం విశేషం. ఇక పూజ కార్య్ర‌క‌మం అయి వెంట‌నే కారు ఎక్క‌డానికి వెళుతుండా ప‌లువురు అభిమానులు చ‌ర‌ణ్ డాన్స్ నాటు నాటు.. అదుర్స్ అంటూ ఆనందంతో కేక‌లు వేశారు. చిరుమంద‌హాసంతో ఆయ‌న కారు ఎక్కి ఒక్క‌సారి చేయి ఊపి వెళ్ళిపోయారు.

ఇక జూబ్లీహిల్స్‌లోని ప‌లుచోట్ల షూటింగ్‌ల‌లోనూ ఆర్‌.ఆర్‌.ఆర్‌. పాట గురించే చ‌ర్చ రావ‌డం విశేషం. ఏదిఏమైనా మొద‌టినుంచి రాజ‌మౌళి ప్ర‌చార స‌ర‌ళి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments