Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ ఖిలాడి ఫిబ్రవరి 11న విడుదల

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (16:19 IST)
Raviteja - Khiladi
రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది.  సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ఖిలాడి సినిమా విడుదల తేదీని గురువారం చిత్రనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌లో సిగరెట్ తాగుతూ మాస్ లుక్కులో రవితేజ కనిపించారు.
 
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.
 
ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియెస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ డిఫరెంట్ రోల్‌ను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
 
సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు.  శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు : రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్ తదితరులు
 
సాంకేతిక బృందం-  కథ, కథనం, దర్శకత్వం : రమేష్ వర్మ, నిర్మాత  : సత్యనారాయణ కోనేరు, బ్యానర్ :  ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్, ప్రొడక్షన్  : ఏ హవీష్ ప్రొడక్షన్, సమర్పణ  : డాక్టర్ జయంతిలాల్ గద,  సంగీతం  : దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫర్  : సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణు, స్క్రిప్ట్ కో ఆర్టినేషన్  : పాత్రికేయ,  ఫైట్స్  : రామ్ లక్ష్మణ్, అన్బు అరివు,  డైలాగ్స్  : శ్రీకాంత్ విస్స, సాగర్, ఎడిటర్  : అమర్ రెడ్డి లిరిక్స్  : శ్రీ మణి,  స్టిల్స్  : సాయి మాగంటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్   : మురళీకృష్ణ కొడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments