Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీలో కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల మంత్రిని క‌లిసిన మంత్రి మేక‌పాటి

ఢిల్లీలో కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల మంత్రిని క‌లిసిన మంత్రి మేక‌పాటి
విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (16:01 IST)
న్యూఢిల్లీలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క‌లిశారు. పీఎల్‌ఐ స్కీం కింద దేశంలో ఏర్పాటు చేయనున్న మూడు విద్యుత్‌ ఉపకరణ జోన్‌లల్లో ఒకటి ఏపీలో ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి కేంద్ర మంత్రిని కోరారు.భారీ విద్యుత్‌ ఉపకరణాల జోన్‌గా మన్నవరం అనుకూలంగా ఉంటుంద‌ని మేకపాటి వెల్లడించారు. 

 
గతంలో ఎన్‌టీపీసీ-బీహెచ్‌ఈఎల్‌కు కేటాయించిన 750 ఎకరాల భూమిని ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ గా మార్చేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి మేకపాటికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు తెలిపారు. మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల జోన్‌పై త్వరలో ఎన్‌టీపీసీ-బీహెచ్‌ఈఎల్‌ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. 

 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వాణిజ్య ఉత్సవం- 2021ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అభినందించారు. కొప్పర్తిలో భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు గురించి కేంద్ర మంత్రి పీయూష్ దృష్టికి మంత్రి మేకపాటి తీసుకువెళ్ళారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఏడు టెక్స్‌టైల్‌ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్ల‌డించారు. విశాఖ-చెన్నై కారిడార్‌లో రాష్ట్ర వాటాను 20 నుంచి 10 శాతానికి తగ్గించాలని మేక‌పాటి కోరారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి మంత్రి మేకపాటి ప్రతిపాదనను గతి శక్తిలో ఏపీ భాగస్వామ్యం అవడం ద్వారా సహకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ వెల్లడించారు.
 

రాష్ట్ర ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్ వీలువెంబ‌డి అన్నీ చేద్దామ‌న్నారు. విశాఖలోని మెడ్ టెక్ జోన్ లో మెడక్సిల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రిని మేక‌పాటి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ భవన్ కమిషనర్ భావనా సక్సేనా, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ,పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జాగ్ర‌త్త‌... అధికారుల‌కు సీఎం హెచ్చ‌రిక‌, సూచ‌న‌లు