Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జాగ్ర‌త్త‌... అధికారుల‌కు సీఎం హెచ్చ‌రిక‌, సూచ‌న‌లు

చిత్తూరు జాగ్ర‌త్త‌... అధికారుల‌కు సీఎం హెచ్చ‌రిక‌, సూచ‌న‌లు
విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (15:20 IST)
చిత్తూరు జిల్లాకు అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉందని దీనిని ఎదుర్కునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి కోసం శిబిరాలను ఏర్పాటు చేయాల‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సూచించారు. వారికి మంచి ఆహారం ఇప్పించాలని, శిబిరాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఒక్కొక్కరికి రూ.వెయ్యి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 
 
 
గత నాలుగు రోజులుగా వర్షాలు కురవడం, చిత్తూరు, నెల్లూరు,ప్రకాశం, కర్నూల్ జిల్లాల కలెక్టర్ లతో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉందని, అదే విధంగా చేపట్టాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి తెలిపారు. చిత్తూరు జిల్లాకు 2 ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలను పంపామని, మంగళగిరిలో 17, కర్నూల్ 2, ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచామని, అగ్ని మాపక దళాలను సిద్దంగా ఉంచుకోవాలని కలెక్టర్ లకు సూచించారు. ఈ రోజు సాయంత్రం తీరం దాటే సమయంలో గాలులు 45 నుండి 55 కిమీ వేగంతో ఉంటాయని అదే విధంగా 18 నుండి 20 సెమీ వర్షం నమోధు అవుతుందని వాతా వరణ శాఖ అంచనా వేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. 
 
 
అత్యవసర నిధుల కింద చిత్తూరు జిల్లాకు రూ .50 లక్షలు విడుదల చేయడం జరిగిందని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ మాట్లాడుతూ జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని గ్రామ స్థాయిలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి చెరువుల స్థితి గతులను పరిశీలిస్తున్నారని గత 24 గంటలలో జిల్లాలోని వరదయ్యపాళెంలో 14 సెమీ, వడమాలపేటలో 11 సెమీ, సత్యవేడు 11 సెమీ, బి.ఎన్.కండ్రిగ లో 10 సెమీ, కె.వి.బి.పురం లో 10 సెమీ, విజయపురంలో 8.2 సెమీ, నారాయణ వనం లో 8 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైందని తెలిపారు.
 
 
ప్రధానంగా శ్రీకాళహస్తి, నగిరి, సత్యవేడు నియోజక వర్గాలలో ఎక్కువ ప్రభావం చూపుతోoదని, అదే విధంగా మదనపల్లి, పుంగనూరు, పీలేరు ప్రాంతాలలో భారీ వర్షాలు నమోధు కావడంతో కాజ్ వే ల మీద ప్రమాధ స్థాయిలో ప్రవాహం ఉండడంతో పోలీసులు రెవెన్యూ సిబ్బందితో టీం లను ఏర్పాటు చేసి ప్రజలను కట్టు దిట్టం చేస్తున్నామన్నారు. తూర్పు ప్రాంతాలలోని అరణియార్, కాలంగి రిజర్వాయర్ల నుండి భారీ ఎత్తున నీటిని విడుదల చేయడం జరిగిందని, సూళ్ళూరు పేట ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులను అప్రమత్తo చేయడం జరిగిందన్నారు. 
 
 
భారీ వర్షాల వల్ల విద్యార్ధులు స్కూల్ లకు చేరుకోవడం కష్టంగా ఉందని స్కూల్ లకు శెలవు ప్రకటించామన్నారు. ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు ఇంజినీరింగ్ శాఖల వారితో సమావేశం నిర్వహించి జె.సి.బి తదితర యంత్రాలను సిద్దంగా ఉంచుకొన్నామన్నారు. కలెక్టరేట్ నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. రెండు సహాయక శిభిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో 406 మంది ఉన్నారని వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యమంత్రికి వివరించారు.


గ్రామ స్థాయిలో వివిధ శాఖల ఉద్యోగులు సచివాలయాల్లో ఉండడం వల్ల ఆ రంగాలలో నష్టాన్ని వెంటనే అంచనా వేయడం జరుగుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, డి.ఆర్.ఓ మురళి లు పాల్గొన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి రైతుల మహాపాద యాత్రను అణచివేసేందుకు జగన్ రెడ్డి కుట్ర